Pushpa 2 Collections: నాలుగు రోజుల్లో 800 కోట్లు - ఐనా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కానీ అల్లు అర్జున్ పుష్ప 2
Pushpa 2 Collections: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు కంటే హిందీలోనే పుష్ప 2కు ఎక్కువ కలెక్షన్స్ వస్తోన్నాయి. ఆదివారం రోజు హిందీ వెర్షన్ 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా...తెలుగులో 44 కోట్లు వచ్చాయి.
Pushpa 2 Collections: అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. నాలుగు రోజుల్లోనే 800 కోట్ల మైలురాయిని చేరుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, భాషల్లో ఈ మూవీ భారీగా వసూళ్లను రాబడుతోంది. కేరళలో మాత్రం ఆశించిన స్థాయిలో పుష్ప 2 వసూళ్లను దక్కించుకోలేకపోతుంది.
141 కోట్ల కలెక్షన్స్...
వరల్డ్ వైడ్‌గా ఆదివారం రోజు అన్ని భాషల్లో కలిపి పుష్ప 2 మూవీ 141 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. నాలుగు రోజుల్లో ఇండియా వైడ్‌గా 529 కోట్ల కలెక్షన్స్ అల్లు అర్జున్ మూవీకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
44 కోట్లు...
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం పుష్ప మూవీ 44 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. కర్ణాటకలో 13 కోట్లు...తమిళ్‌లో 12 కోట్ల వరకు పుష్ప 2 మూవీ కలెక్షన్లను సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో పుష్ప కలెక్షన్స్ రెండు వందల కోట్లు దాటినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్‌లో రికార్డ్ కలెక్షన్స్...
టాలీవుడ్ కంటే నార్త్‌లోనే పుష్ప 2 హవా ఎక్కువగా కనిపిస్తోంది. రిలీజ్ రోజు నుంచి తెలుగు కంటే హిందీలోనే ఈ మూవీ ఎక్కువగా వసూళ్లను దక్కించుకుంటోంది. ఆదివారం రోజు హిందీ వెర్షన్ ఏకంగా 75 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు చెబుతోన్నారు. హిందీ బాక్సాఫీస్ వద్ద సింగిల్ డేలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో పుష్ప 2 మూవీకి నాలుగు రోజుల్లో 285 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఓవర్‌సీస్‌లోనూ పుష్ప 2 అదరగొడుతోంది.
ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్
హిందీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ 277 కోట్ల కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. ఆ సినిమా రికార్డును పుష్ప 2 దాటేసింది. ప్రభాస్ కల్కి 2898 ఏడీ రికార్డ్‌పై కన్నేసింది. కల్కి మూవీ బాలీవుడ్ వెర్షన్‌కు 294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం నాటితో కల్కి కలెక్షన్స్‌ను పుష్ప 2 దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నారు.
బ్రేక్ ఈవెన్ కావాలంటే..
పుష్ప బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు మాత్రం రీచ్ కాలేదు. పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 240 కోట్లకుపైనే కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. సోమవారం కలెక్షన్స్‌ను బట్టే ఈ సినిమా బ్రేక్ అవుతుందా? లేదా? అన్నది ఆధారపడే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఎలివేషన్లు...హీరోయిజం..
పుష్ప 2 మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. పుష్పకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోయిన్, ఎలివేషన్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కథ కంటే హీరోను పవర్‌ఫుల్‌గా చూపించడంపైనే దర్శకుడు సుకుమార్ ఫోకస్ పెట్టినట్లు విమర్శలు కూడా వ్యక్తమవుతోన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. పుష్ప 2కు కొనసాగింపుగా పుష్ప 3 కూడా రాబోతున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్‌చేసింది.