Tollywood Releases: ఈ వారం థియేటర్లలోకి రానున్నమూవీస్ ఇవే - బాక్సాఫీస్ బరిలో ఏడు తెలుగు సినిమాలు
Tollywood Releases: ఈ శుక్రవారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఏడు సినిమాలు రాబోతున్నాయి. విశ్వక్‌సేన్ మెకానిక్ రాఖీ,తో పాటు దేవకి నందన వాసుదేవ, కేసీఆర్, జీబ్రాతో పాటు మరో మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
Tollywood Releases: ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఏడు తెలుగు సినిమాలు నిలవబోతున్నాయి. విశ్వక్‌సేన్ మెకానిక్ రాఖీ, మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా దేవకి నందన వాసుదేవతో పాటు మరో ఐదు సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాయి. . వీటిలో ఎక్కువగా అంచనాలు ఉన్న సినిమా ఏదంటే?
విశ్వక్‌సేన్ మెకానిక్ రాఖీ
విశ్వక్‌సేన్ మెకానిక్ రాఖీ మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. యాక్షన్ కామెడీ కథాంశతో తెరకెక్కిన ఈ మూవీతో రవితేజ ముళ్లపూడి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో మెకానిక్ రాఖీపైనే బజ్ ఎక్కువగా ఉంది. గామి సక్సెస్ తర్వాత విశ్వక్‌సేన్ నటిస్తోన్న మూవీ ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రమోషన్స్‌లో విశ్వక్‌సేన్ కామెంట్స్ కూడా ఈ సినిమాపై హైప్ ఏర్పడటానికి ఓ కారణమయ్యాయి.
దేవకి నందన వాసుదేవ...
మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న దేవకి నందన వాసుదేవ ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందించగా...అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. మైథలాజికల్ టచ్‌తో కూడిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది.
కేసీఆర్...
జబర్ధస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో సీనియర్ నటి సత్యకృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి రాకింగ్ రాకేష్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. కథ, స్క్రీన్‌ప్లేను అతడే అందించాడు.
బ్యాంకు మోసాల నేపథ్యంలో…
సత్యదేవ్, పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ హీరోలుగా నటించిన జీబ్రా మూవీ ఈ ఫ్రైడే థియేటర్లలోకి రాబోతోంది. బ్యాంకు మోసాల నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు.
సన్నీలియోన్ మందిర…
ఈ నాలుగు సినిమాలతో పాటు రోటి కపడా రొమాన్స్, సన్నీలియోన్ మందిర, త్రిగుణ్ ఉద్వేగం ఈ వారమే థియేటర్లలో సందడి చేయబోతున్నారు.