తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: మీరిచ్చిన ప్రేమ మీ దత్తపుత్రుడు మల్లు అర్జున్‌‌ మర్చిపోలేనిది.. కేరళలో అల్లు అర్జున్ కామెంట్స్

Allu Arjun: మీరిచ్చిన ప్రేమ మీ దత్తపుత్రుడు మల్లు అర్జున్‌‌ మర్చిపోలేనిది.. కేరళలో అల్లు అర్జున్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

28 November 2024, 16:34 IST

google News
    • Allu Arjun Comments In Kerala At Pushpa 2 Event: మీ అడాప్టెడ్ సన్ (దత్త పుత్రుడు) మల్లు అర్జున్‌కు ఇచ్చిన ప్రేమ, గ్రాండ్ వెల్‌కమ్ మర్చిపోలేనేది అని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కేరళలో జరిగిన పుష్ప 2 ది రూల్ ఈవెంట్‌లో మలయాళ అభిమానుల సపోర్ట్‌పై అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు.
మీర్చిచ్చిన ప్రేమ మీ దత్తపుత్రుడు మల్లు అర్జున్‌‌ మర్చిపోలేనిది.. కేరళలో అల్లు అర్జున్ కామెంట్స్
మీర్చిచ్చిన ప్రేమ మీ దత్తపుత్రుడు మల్లు అర్జున్‌‌ మర్చిపోలేనిది.. కేరళలో అల్లు అర్జున్ కామెంట్స్

మీర్చిచ్చిన ప్రేమ మీ దత్తపుత్రుడు మల్లు అర్జున్‌‌ మర్చిపోలేనిది.. కేరళలో అల్లు అర్జున్ కామెంట్స్

Allu Arjun Comments In Kerala At Pushpa 2 Event: పుష్ప-2 ది రూల్‌ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్‌గా నటించిన విషయం తెలిసిందే.

హై బడ్జెట్‌తో

బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వలో, ఆయన క్లాస్‌ టేకింగ్‌తో ఈ పుష్ప 2 బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలవనుందని అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.

ప్రతి ఈవెంట్ సెన్సేషన్

డిసెంబరు 5న పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్‌ సెన్సేషన్‌ అవుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది.

మల్లు అర్జున్‌గా పేరు

చెన్నైలో జరిగిన వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ కూడా గ్రాండ్‌ సక్సెస్‌గా నిలిచింది. ఐకాన్‌ స్టార్‌ ఎక్కడికి వెళితే అక్కడ అల్లు అర్జున్ అభిమానులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలుకుతున్నారు. తాజగా ఈ చిత్రం మరో గ్రాండ్‌ ఈవెంట్‌ కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా జరిగింది. కేరళలో మల్లు అర్జున్‌గా అత్యధిక అభిమానులు ఉన్న తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌కు అక్కడ అశేష జనాదరణ లభించింది.

అడాప్టెడ్ సన్‌

ఈ వేడుకలో ఐకాన్‌స్టార్‌ అభిమానులు ఎంతో సందడిగా కనిపించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. "థ్యాంక్యూ కేరళ. మీ అడాప్టెడ్ సన్ (దత్త పుత్రుడు) మల్లు అర్జున్‌కు మీరిచ్చిన ఈ గ్రాండ్‌ వెలకమ్‌ మరిచిపోలేనిది. గత 20 ఏళ్ల నుంచి మీరు నాపై ప్రేమ చూపిస్తున్నారు. ఈ సినిమా కెరీర్‌లో చాలా ప్రత్యేకం" అని అల్లు అర్జున్ అన్నాడు.

మూడేళ్లుగా వెయిటింగ్

"ఈ చిత్రంలో మలయాళ గొప్ప నటుడు ఫహాద్‌ ఫాజిల్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆయన నటన చూసి మీరంతా గర్వపడతారు. నా సినిమా కోసం మీరు మూడేళ్లుగా వెయిట్‌ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తప్పకుండా ఇక నుంచి తొందరగా సినిమాలు చేస్తాను. ఈ సినిమాలో రష్మిక తన నటనతో మెప్పిస్తుంది. రష్మికతో పనిచేయడం ఎంతో కంఫర్ట్‌గా అనిపించింది. రష్మిక ప్రజెన్స్‌తో సినిమా చాలా బెటర్‌ అయింది" అని అల్లు అర్జున్ తెలిపాడు.

ఆర్యతోనే స్టార్ట్ అయింది

"సుకుమార్‌ నా కెరీర్‌లో ఆర్యను ఇచ్చాడు. ఆర్య చిత్రంతోనే నా మార్కెట్‌ కేరళలో స్టార్ట్‌ అయింది. దర్శకుడు సుకుమార్‌ వల్లే నేను మీకు దగ్గరయ్యాను. నా కెరీర్‌లో దేవి శ్రీ ప్రసాద్‌ ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చాడు. నా చిత్రానికి పనిచేసిన మలయాళీ రైటర్స్‌‌కు కూడా.. చాలా థ్యాంక్స్‌. మైత్రీ నవీన్‌, రవి, చెర్రీలకు వారి సపోర్ట్‌ వల్ల ఈ సినిమా సాధ్యమైంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

మలయాళ లిరిక్స్‌తో సాంగ్

"ఓ రోజు దేవి శ్రీ ప్రసాద్‌కు ఫోన్‌ చేసి నా కేరళ ఆడియన్స్‌కు ప్రేమ చూపించాలి అన్నాను. ఈ సినిమాలో మలయాళ లిరిక్స్‌తో ఓ సాంగ్‌ను చేశాం. అన్నిభాషల్లో మలయాళం లిరిక్స్‌ ఉంటాయి. ఇది మలయాళ ప్రేక్షకులకు ఈ రూపంలో ప్రేమ చూపిస్తున్నాను. మలయాళంలో చేసిన ఈ పాటలో వింటేజ్ బన్నీని చూస్తారు" అని అల్లు అర్జున్ అన్నాడు.

డ్యాన్స్‌ చూస్తారు

"మలయాళీ ఫ్యాన్స్‌ ఆర్మీ అనే పదాన్ని స్టార్ట్‌ చేశారు. డిసెంబరు 5న పదకొండు వేలకు పైగా థియేటర్‌లో విడుదలవుతోంది. పుష్ప పాత్రలో పుష్ప-1లో డ్యాన్సులు చేయడం కుదరలేదు. ఈ పాటలో నా డ్యాన్స్‌ వింటేజ్‌ బన్నీని చూస్తారు. ఆరు లాంగ్వేజ్‌ల్లో ఈ పాట మలయాళంలోనే హుక్‌ లైన్‌ ఉంటుంది. వైల్డ్‌ ఫైర్‌తో సినిమా ఉంటుంది. ఎంజాయ్‌ చేయండి" అని అల్లు అర్జున్ తన స్పీచ్ ముగించాడు. అయితే, అల్లు అర్జున్‌ స్పీచ్‌కు ముందుగా మలయాళంలో మాట్లాడి అభిమానులను హుషారెత్తించారు.

తదుపరి వ్యాసం