Unstoppable S4: నన్ను మార్చిన ఆయుధం స్నేహారెడ్డి.. కురుక్షేత్రం స్టార్ట్ చేస్తాను.. బాలకృష్ణతో అల్లు అర్జున్ (వీడియో)-unstoppable 4 november 15 episode promo released balakrishna allu arjun unstoppable with nbk 4 promo latest ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable S4: నన్ను మార్చిన ఆయుధం స్నేహారెడ్డి.. కురుక్షేత్రం స్టార్ట్ చేస్తాను.. బాలకృష్ణతో అల్లు అర్జున్ (వీడియో)

Unstoppable S4: నన్ను మార్చిన ఆయుధం స్నేహారెడ్డి.. కురుక్షేత్రం స్టార్ట్ చేస్తాను.. బాలకృష్ణతో అల్లు అర్జున్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Nov 10, 2024 01:07 PM IST

Unstoppable With NBK 4 Promo Balakrishna Allu Arjun: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. అఖండతో పుష్ప అనే క్యాప్షన్‌తో రిలీజ్ అయిన ఈ ప్రోమోలో పుష్ప 3, అఖండ 3 సినిమాల గురించి బాలకృష్ణ, అల్లు అర్జున్ మాట్లాడుకున్నారు. అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో విశేషాలు చూస్తే..

నన్ను మార్చిన ఆయుధం స్నేహారెడ్డి.. కురుక్షేత్రం స్టార్ట్ చేస్తాను.. బాలకృష్ణతో అల్లు అర్జున్ (వీడియో)
నన్ను మార్చిన ఆయుధం స్నేహారెడ్డి.. కురుక్షేత్రం స్టార్ట్ చేస్తాను.. బాలకృష్ణతో అల్లు అర్జున్ (వీడియో) (Aha OTT/YouTube)

Unstoppable With NBK 4 Balakrishna Allu Arjun: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4 నవంబర్ 15 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా ఆహా ఓటీటీ టీమ్ రిలీజ్ చేసింది. అఖండతో పుష్ప.. ఇద్దరు ఫైరే.. అనే క్యాప్షన్‌తో ఈ ప్రోమోను సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఎపిసోడ్‌కు అతిథిగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు.

అల్లు అర్జున్‌కు ఎలివేషన్

అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపించిన బాలకృష్ణ సమరసింహా రెడ్డి మూవీ డైలాగ్‌ కొట్టడంతో స్టార్ట్ అయింది. తర్వాత అల్లు అర్జున్‌ను మై డియర్ యంగ్ బ్రదర్ అంటూ బాలకృష్ణ ఎలివేషన్ ఇవ్వగా బన్నీ ఎంట్రీ ఇచ్చాడు. "మనిద్దరం రిలేటివ్స్ తెలుసా?" అని బాలయ్య అంటే.. "ఎలా సార్?" అని అల్లు అర్జున్ అన్నాడు.

కృష్ణుడు-అర్జునుడు

"ఇక్కడ ఈ కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు" అని బాలకృష్ణ బదులిచ్చాడు. దాంతో "మీరు గీత ఇవ్వండి.. నేను కురుక్షేత్రం స్టార్ట్ చేస్తాను" అని అల్లు అర్జున్ డైలాగ్ విసిరాడు. నాకు పార్టీ ఇవ్వలేదేంటీ అని బాలయ్య అడిగితే.. మీతో కచ్చితంగా మీ మ్యాన్షన్‌లో ఒక హౌజ్ పార్టీ అని అల్లు అర్జున్ అన్నాడు. దాంతో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఊ అంటావా మామ సాంగ్ ప్లే అయింది.

అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్

అనంతరం కట్ చేస్తే.. "ఇప్పుడు నీ గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తిని పిలవాలని ఉంది. అరవింద్ గారి సతీమణి. మా బెజవాడ ఆడపడుచు. మా రామలింగయ్య గారి కోడలు. నిర్మల గారు ఆన్ ది స్టేజ్" అని అల్లు అర్జున్ తల్లిని పిలిచాడు బాలకృష్ణ. దాంతో అల్లు అరవింద్ భార్య నిర్మల స్టేజీ మీదకు వచ్చారు. అది చూసి "నిజంగా ఇది నాకే సర్‌ప్రైజ్ ఇది. నాకే తెలీదు ఇది" అని అల్లు అర్జున్ ఆశ్చర్యపోయాడు.

దేనితో కొట్టలేదని అడగాలి

"నిర్మల గారు మీరు చిన్నప్పుడు బన్నీని దెబ్బేశారా" అని బాలకృష్ణ అడిగితే.. "ఒకటా.. అసలు దేనితో కొట్టలేదని అడగాలి" అని అల్లు అర్జున్ అన్నాడు. దాంతో అంతా నవ్వేశారు. "అన్ని వెపన్స్‌తో ఇలా సినిమాల్లో లాగా యాక్షన్ చేస్తుంది" అని అల్లు అర్జున్ అంటే.. "మరి ఏ వెపన్ వల్ల నువ్ మారావు అనుకోవచ్చు" అని బాలకృష్ణ అడిగాడు.

స్నేహారెడ్డి ఆయుధంతో

దానికి కాస్తా ఆలోచించిన అల్లు అర్జున్ "స్నేహారెడ్డి అనే ఒక వెపన్ వల్ల" అని బదులిచ్చాడు. దాంతో బాలకృష్ణ తెగ నవ్వేశాడు. "అల్లు అర్జున్ డల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు మీరెళ్లి ఓదార్చారా" అని బాలయ్య అడిగాడు. అప్పుడు నిర్మల చెప్పిన సమాధానాన్ని కాస్తా మ్యూట్ చేశారు. "తనకు వస్తదనుకున్న" అనే వరకు నిర్మల చెప్పడం చూపించారు. తర్వాత ఆడియో మ్యూట్ చేశారు.

పుష్ప 3-అఖండ 3

అనంతరం ప్రోమో చివరిలో బాలకృష్ణ, అల్లు అర్జున్ మాట్లాడుకోవడం చూపించారు. "మీరు పుష్ప 3 చేయండి. నేను అఖండ 3 చేస్తాను" అని అల్లు అర్జున్ అన్నాడు. దాంతో బాలకృష్ణ ఆశ్చర్యంతో అవాక్కయ్యాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో పుష్ప పుష్ప సాంగ్ ప్లే అయింది. అప్పుడు పుష్పరాజ్ వాకింగ్ స్టైల్‌లో బాలకృష్ణ, అల్లు అర్జున్ నడిచుకుంటూ వచ్చి తొడ గొట్టారు. తగ్గేదే లే అంటూ పుష్ప మ్యానరిజంతో బాలయ్య డైలాగ్ కొట్టాడు.

Whats_app_banner