Pushpa 2 Update: ‘పుష్ప 2: ది రూల్’ నుంచి అఫీషియల్ అప్‍డేట్.. ఖుషి అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్-allu arjun fans expressing happiness after makers announces pushpa 2 the rule first half final editing update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Update: ‘పుష్ప 2: ది రూల్’ నుంచి అఫీషియల్ అప్‍డేట్.. ఖుషి అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Pushpa 2 Update: ‘పుష్ప 2: ది రూల్’ నుంచి అఫీషియల్ అప్‍డేట్.. ఖుషి అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 08, 2024 06:07 PM IST

Pushpa 2: The Rule Update: పుష్ప 2 సినిమాపై మూవీ టీమ్ ఓ అప్‍డేట్ ఇచ్చింది. బాక్సాఫీస్ హిస్టరీని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ అప్‍డేట్ పంచుకుంది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pushpa 2 Update: ‘పుష్ప 2: ది రూల్’ నుంచి అఫీషియల్ అప్‍డేట్.. ఖుషి అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
Pushpa 2 Update: ‘పుష్ప 2: ది రూల్’ నుంచి అఫీషియల్ అప్‍డేట్.. ఖుషి అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‍లో ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. సుమారు మూడేళ్లుగా ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ సాగుతోంది. ఈ సినిమా అప్‍డేట్ల కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు, గింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాగా, పుష్ప 2 సినిమాపై నేడు (అక్టోబర్ 8) ఓ సర్‌ప్రైజింగ్ అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్.

ఫస్ట్ హాఫ్ రెడీ

పుష్ప 2 ది రూల్ సినిమా ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిటింగ్ పూర్తయి సిద్ధమైపోయిందని మూవీ టీమ్ వెల్లడించింది. లాక్డ్, లోడెడ్ అంటూ ఓ పోస్టర్ తీసుకొచ్చింది. ఫైర్‌తో లోడ్ అయిందని పేర్కొంది. అడవిలో కొండపై అల్లు అర్జున్ నిల్చొని ఉన్నట్టు లాంగ్ షాట్ ఈ పోస్టర్‌లో ఉంది.

పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందంటూ ఈ అప్‍డేట్‍ను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. “పుష్ప 2 ది రూల్ ఫస్ట హాఫ్ ఫైర్‌తో లాక్, లోడ్, ప్యాక్ అయింది. పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించే చరిత్రను చూసేందుకు రెడీగా ఉండండి. భారత సినీ చరిత్రలో అతడు కొత్త ఆధ్యాయాన్ని రగిలిస్తాడు. డిసెంబర్ 6న థియేటర్లలోకి వచ్చేస్తోంది” అని ట్వీట్ చేసింది.

సంతోషంలో ఫ్యాన్స్

పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ హాఫ్ లాక్డ్ అని అప్‍డేట్ రావడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. బ్లాక్‍బస్టర్ పక్కా అంటూ మేకర్స్ అంత నమ్మకంగా చెబుతుండటం పట్ల ఖుషి అవుతున్నారు. రిలీజ్‍కు రెండు నెలల ముందే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తి అయిందని చెప్పడంతో మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్‍గా ఉన్నారో అర్థమవుతోందని అంటున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా రావడం పక్కా అంటూ ఆనందిస్తున్నారు. పుష్ప 2 చిత్రాన్ని వాయిదా రూమర్లు వెంటాడుతున్న తరుణంలో ఈ అప్‍డేట్ రావడం అభిమానులకు ఊరట కలిగించింది.

పుష్ప 2 చిత్రం షూటింగ్ ఓ వైపు వేగంగా సాగుతోంది. యూనిట్లుగా విడిపోయి చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అదే రేంజ్‍లో సాగుతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా పూర్తయింది. సెకండ్ హాఫ్‍లో కొంత పోర్షన్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది.

2021లో వచ్చి ఇండియన్ బాక్సాఫీస్‍ను షేక్ చేసే బ్లాక్‍బస్టర్ అయింది పుష్ప. పాన్ ఇండియా రేంజ్‍లో సత్తాచాటింది. తెలుగుతో పాటు హిందీలోనూ బంపర్ హిట్ కొట్టింది.అల్లు అర్జున్ మేనరిజమ్స్, స్వాగ్, డైలాగ్‍లు, డ్యాన్సులు హిందీ జనాలను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్‍గా వస్తున్న ‘పుష్ప 2’ చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ మూవీ రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‍కు సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా ఉండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

Whats_app_banner