తెలుగు న్యూస్  /  Entertainment  /  Ahimsa Vs Pareshan Boxoffice Clash Between Daggubati Brothers

Rana vs Abhiram: రానా వ‌ర్సెస్ అభిరామ్ - ఈ ఫ్రైడే బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతోన్న ద‌గ్గుబాటి బ్ర‌ద‌ర్స్‌

HT Telugu Desk HT Telugu

01 June 2023, 13:58 IST

  • Rana vs Abhiram: ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద ద‌గ్గుబాటి బ్ర‌ద‌ర్స్ రానా, అభిరామ్ పోటీప‌డ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రిలో గెలుపు ఎవ‌రిద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ద‌గ్గుబాటి  రానా
ద‌గ్గుబాటి రానా

ద‌గ్గుబాటి రానా

Rana vs Abhiram: ఈ శుక్ర‌వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ద‌గ్గుబాటి అన్న‌ద‌మ్ములు రానా(Rana Daggubati), అభిరామ్ (Abhiram Daggubati) పోటీప‌డ‌బోతున్నారు. అభిరామ్ హీరోగా అరంగేట్రం చేస్తోన్న‌ అహింస‌తో పాటు రానా ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ప‌రేషాన్ జూన్ 2న (రేపు) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. త‌మ్ముడు హీరోగా... అన్న స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న రెండు వేర్వేరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానుండ‌టం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Prasanth Varma: బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అందులో భాగమే.. జై హనుమాన్ కంటే ముందే!

Recent OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే

ఈ పోటీలో అన్న గెలుస్తాడా? త‌మ్ముడి సినిమా స‌క్సెస్ అవుతుందా? అన్న‌ది మ‌రో ఇర‌వై నాలుగు గంట‌ల్లో తేల‌నుంది. అహింస సినిమాకు తేజ (Teja) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. గాంధీ మార్గాన్ని న‌మ్మే ఓ యువ‌కుడు త‌న ల‌క్ష్యం కోసం హింస మార్గాన్ని ఎందుకు ప‌ట్టాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ. ఈ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీతోనే అభిరామ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

అహింస సినిమాలో గీతిక హీరోయిన్‌గా న‌టిస్తోంది.దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. త‌మ్ముడి అహింస సినిమాకు పోటీగా రానా ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ప‌రేషాన్ మూవీ కూడా ఈ శుక్ర‌వారం విడుద‌ల‌కానుంది.

తెలంగాణ నేప‌థ్యంలో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌రేషాన్ మూవీ రూపొందుతోంది. తిరువీర్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట ఫేమ్ రూప‌క్ రొనాల్డ్‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

సింగ‌రేణి యువ‌త జీవ‌న శైలిని ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. మ‌సూద స‌క్సెస్ త‌ర్వాత తీరువీర్ హీరోగా న‌టిస్తోన్న మూవీ ఇది కావ‌డం విశేషం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.