Venkatesh on Rana Naidu: రానా నాయుడు బూతు కంటెంట్‌పై వెంకటేశ్ రియాక్షన్ ఇదీ
Venkatesh on Rana Naidu: రానా నాయుడు బూతు కంటెంట్‌పై వెంకటేశ్ రియాక్టయ్యాడు. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Venkatesh on Rana Naidu: టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన విక్టరీ వెంకటేశ్ రానా నాయుడు సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అడుగుపెట్టిన విషయం తెలుసు కదా. అయితే ఈ సిరీస్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. మరీ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం, బూతులు మాట్లాడటంపై విమర్శలు వచ్చాయి. వెంకటేశ్ లాంటి సీనియర్ నటుడు ఇలాంటి బూతు సిరీస్ లో నటించడం ఏంటని అభిమానులు ప్రశ్నించారు.
అయితే తాజాగా దీనిపై వెంకటేశ్ స్పందించాడు. అహింస మూవీ ప్రెస్ మీట్ లో వెంకీ ఈ రానా నాయుడుపై జరిగిన ట్రోలింగ్ పై రియాక్టయ్యాడు. అంతేకాదు రెండో సీజన్ లో ఇందులో మార్పలు చేయనున్నట్లు కూడా చెప్పాడు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ తొలి సీజన్ కు నిజానికి మంచి ఆదరణే లభించింది. ఆ ఓటీటీలో చాలా కాలం పాటు ఇండియాలోని టాప్ ట్రెండింగ్స్ లో ఉంది.
అయితే దీనిని ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి అసలే లేదు. ఓ ఫ్యామిలీ హీరోగా పేరుగాంచిన వెంకీ అదే ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సిరీస్ ద్వారా దూరమయ్యాడు. దీంతో రెండో సీజన్ లో మార్పులు చేసి మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెంకీ చెప్పాడు. ఇది ఒరిజినల్ కంటెంట్ అని, దీనికి మార్పులు చేయనున్నట్లు తెలిపాడు.
అయితే ఈ సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తో నెట్‌ఫ్లిక్స్ సంతోషంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా అతడు స్పష్టం చేశాడు. ప్రతి సెక్షన్ ఆడియెన్స్ ను సంత్రుప్తి పరచడం సాధ్యం కాదని కూడా వెంకటేశ్ అనడం విశేషం. నిజానికి రానా నాయుడు సిరీస్ వచ్చి చాలా రోజులే అవుతున్నా.. వెంకీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సైంధవ్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో దీనిపై స్పందించలేదు.
ఈ సిరీస్ ప్రమోషన్లలోనే వెంకీ ఇందులో బూతులు మాట్లాడటం తనకు చాలా ఇబ్బంది కలిగించిందని చెప్పాడు. ఈ సిరీస్ ద్వారా ఏదో కొత్తగా ట్రై చేయాలనుకుంటే అది కాస్తా వెంకీ ఇమేజ్ ను కాస్త డ్యామేజ్ చేసింది. అయినా రానా నాయుడుకు వచ్చిన రెస్పాన్స్ తో తాను సంత్రుప్తిగా ఉన్నానని, తానెప్పుడూ కొత్తగా ట్రై చేస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం వెంకటేశ్ శైలేష్ కొలను డైరెక్షన్ లో సైంధవ్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం