Tollywood | 'అహింస'లో అభిరామ్ లుక్ చూశారా? యాక్షన్ కథలో దగ్గుబాటి హీరో-rana brother abhiram daggubati new look launched from the movie ahimsa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood | 'అహింస'లో అభిరామ్ లుక్ చూశారా? యాక్షన్ కథలో దగ్గుబాటి హీరో

Tollywood | 'అహింస'లో అభిరామ్ లుక్ చూశారా? యాక్షన్ కథలో దగ్గుబాటి హీరో

HT Telugu Desk HT Telugu
Feb 22, 2022 11:14 AM IST

రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న చిత్రం అహింస. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నూతన లుక్ విడుదల చేసింది చిత్రబృందం. యాక్షన్ హీరోగా అభిరామ్ ఆకట్టుకున్నారు.

అహింస చిత్రంలో అభిరామ్
అహింస చిత్రంలో అభిరామ్ (twtter)

ఇప్పటికే దగ్గుబాటి కుటుంబం నుంచి విక్టరీ వెంకటేశ్, రానా హీరోలుగా తెలుగు చిత్రసీమలో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో అభిరామ్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అదే అహింస. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రానా సోదరుడైన అభిరామ్ నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అభిరామ్ లుక్‌ను చూస్తే యాక్షన్ ప్రధానాంశంగా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.

కళ్లకు గంతలు కట్టుకుని నోట్లో నుంచి రక్తం కారుతూ గుబురు గడ్డంతో అసలిసలైన మాస్ లుక్‌లో అభిరామ్ దర్శనమిచ్చారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ యువ హీరో గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి లీకులతో అభిరామ్ పేరు మీడియాలో అప్పట్లో తెగ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సదరు యువ హీరో అప్పట్లో నోరు మెదపలేదు. కానీ ఇటీవల కాలంలో నోరువిప్పిన అతను.. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని, కానీ నా తప్పులు మాత్రం పబ్లిక్‌లోకి వచ్చాయని స్పష్టం చేశాడు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం