తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adive Sesh Counter To Regina: రెజీనా డబుల్ మీనింగ్‌ డైలాగ్‌పై అడివి శేష్ కౌంటర్

Adive Sesh Counter to Regina: రెజీనా డబుల్ మీనింగ్‌ డైలాగ్‌పై అడివి శేష్ కౌంటర్

13 September 2022, 8:48 IST

    • Adivi Sesh Reaction on Regina Joke: రెజీనా, నివేదా థామస్ కలిసి నటించిన చిత్రం శాకిని డాకిని. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అడివి శేష్.. రెజీనా ఇటీవల మగవారిపై వేసిన డబుల్ మీనింగ్ జోక్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు.
రెజినా, అడివి శేష్, నివేదా థామస్
రెజినా, అడివి శేష్, నివేదా థామస్ (Twitter)

రెజినా, అడివి శేష్, నివేదా థామస్

Adivi Sesh About Regina Maggie and Men Joke: టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా కసాండ్ర.. ఇటీవల మగవాళ్ల శృంగార సామర్థ్యంపై డబుల్ మీనింగ్ జోక్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో రెజీనా జోక్‌పై నెటిజన్లు మిశ్రమ స్పందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో అడివి శేష్ కూడా స్పందించారు. నివేదా థామస్‌తో కలిసి రెజీనా నటించిన శాకిని డాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శేష్.. ఈ విషయం గురించి మాట్లాడారు. రెజీనాతోనే తన డబుల్ మీనింగ్ జోక్ కూడా ప్రస్తావన తీసుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Response: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

Baak OTT: ఓటీటీలోకి తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీ బాక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Thalaimai Seyalagam OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానున్న శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. డేట్ ఇదే

నివేదా థామస్, రెజీనాతో పాటు వేదికపై అడివి శేష్ కూడా వస్తారు. అనంతరం వారిద్దరినీ శేష్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇందులో భాగంగా రెజీనా వేసిన డబుల్ మీనింగ్ జోక్‌పై ప్రస్తావన తీసుకొచ్చారు. "రెజీనా ఏంటి ఈ మధ్య 2 నిమిషాల్లో మ్యాగి, మగవాళ్లు అని ఏదో అంటున్నావ్.. ఎందుకు అడుగుతున్నానంటే డైరెక్టర్ నందిని ఎప్పుడూ నాతో అంటూ ఉంటుంది. శేష్ నువ్వు చాలా ఎక్కువ కాలం సినిమాలు తీస్తావ్, నీకు స్టామినా ఎక్కువ అని అంటుంది." అని రెజీనాను శేష్ అడుగ్గా.. ఇందుకు ఆమె కూడా రెండు నిమిషాల్లో చెబుతాను అని నవ్వుతుంది. త్వరగా ఏంటో చెప్పు శేష్ అని అడుగ్గా.. స్టేజ్‌పై ఉన్నవారితో పాటు అందరూ నవ్వులు చిందిస్తారు. దీంతో శేష్ జస్ట్ కిడ్డింగ్ అంటూ ఆ టాపిక్‌ నుంచి తప్పించుకుంటారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెజీనా అబ్బాయిల లైంగిక సామర్థ్యం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "మ్యాగీ లాగానే.. అబ్బాయిలు కూడా రెండు నిమిషాల్లోనే అయిపోతారు" అంటూ కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్ సదరు యాంకర్‌కు అర్థం కాక.. నిజమే అంటూ తలూపాడు. మీకు అర్థం కాలేదు నా జోక్ అనగానే.. నాకు అర్థమైంది ఇప్పుడు అంటూ తలపట్టుకున్నాడు.

సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా శాకిని డాకిని చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు మైకీ మెక్ క్లియర్, నరేశ్ కుమారన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.