Regina double Meaning Joke: పురుషుల శృంగార సామర్థ్యంపై రెజీనా డబుల్ మీనింగ్ జోక్.. మగవారిని అంత మాట అన్నదేంటి భయ్యా..!-regina cassandra says maggi and men lasts for just two minutes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Regina Cassandra Says Maggi And Men Lasts For Just Two Minutes

Regina double Meaning Joke: పురుషుల శృంగార సామర్థ్యంపై రెజీనా డబుల్ మీనింగ్ జోక్.. మగవారిని అంత మాట అన్నదేంటి భయ్యా..!

Maragani Govardhan HT Telugu
Sep 10, 2022 08:33 AM IST

Regina Cassandra on Men Sexual Capacity: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా.. పురుషుల శృంగార సామర్థ్యంపై జోకులు పేల్చింది. మగవారు, మ్యాగీ రెండు నిమిషాల్లోనే అయిపోతారంటూ డబుల్ మీనింగ్ డైలాగును ఉపయోగించింది.

రెజీనా
రెజీనా (Twitter)

Regina cassandra Joke on Men and Maggie: శివ మనస్సులో శృతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రెజీనా. అప్పటి నుంచి టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో నటించకపోయినా.. మంచి ఆఫర్లు ఆమెకు దక్కాయి. ఈ మధ్య కాలంలో కాస్త బ్రేక్ ఇచ్చిన రెజీనా శాకినీ డాకినీ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జర్నలిస్టుపై ఫైర్ అయిన రెజీనా.. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది.

సాధారణంగా సినీ ప్రముఖులు తమ మాటలను పూర్తి నియంత్రణలో పెట్టుకుని మాట్లాడతారు. డబుల్ మీనింగ్ డైలాగులను పొరపాటున కూడా బయటకు రానీయరు. ఇందుకు విరుద్ధంగా రెజీనా మాత్రం డబుల్ మీనింగ్ డైలాగులను పేలుస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది. శాకినీ డాకినీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పురుషుల శృంగార సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె సరదాగా మాట్లాడినప్పటికీ.. లోతుగా ఆలోచిస్తే కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. చిత్ర ప్రచారంలో భాగంగా తెలుగు ఫుడ్ ఛానల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో తనతో పాటు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్ నివేదా థామస్ కూడా పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో అబ్బాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "మ్యాగీ లాగానే.. అబ్బాయిలు కూడా రెండు నిమిషాల్లోనే అయిపోతారు" అంటూ కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్ సదరు యాంకర్‌కు అర్థం కాక.. నిజమే అంటూ తలూపాడు. మీకు అర్థం కాలేదు నా జోక్ అనగానే.. నాకు అర్థమైంది ఇప్పుడు అంటూ తలపట్టుకున్నాడు.

అయితే ఏ విషయంలో రెండు నిమిషాల్లో అబ్బాయిలు అయిపోతారనేది రెజీనా విశీదకరించి చెప్పలేదు. కానీ పరోక్షంగా అబ్బాయిల శృంగార సామర్థ్యం మీదే రెజీనా కామెంట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా శాకిని డాకిని చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు మైకీ మెక్ క్లియర్, నరేశ్ కుమారన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఓ కొరియన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్