తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Duvvada Srinivas On Volunteers : రాజీనామా చేసి వైసీపీ కండువాలు కప్పుకోండి, వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థి హుకుం

Duvvada Srinivas On Volunteers : రాజీనామా చేసి వైసీపీ కండువాలు కప్పుకోండి, వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థి హుకుం

01 May 2024, 22:20 IST

google News
    • Duvvada Srinivas On Volunteers : వాలంటీర్లు రాజీనామా చేసి, వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేయాలని టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేయని వాళ్లను జూన్ 5 తర్వాత తొలగిస్తామన్నారు.
రాజీనామా చేసి వైసీపీ కండువాలు కప్పుకోండి
రాజీనామా చేసి వైసీపీ కండువాలు కప్పుకోండి

రాజీనామా చేసి వైసీపీ కండువాలు కప్పుకోండి

Duvvada Srinivas On Volunteers : ఏపీలో వాలంటీర్ల(AP Volunteers) రాజీనామాలపై టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... వాలంటీర్లు అందరూ తక్షణమే రాజీనామా చేసి వైసీపీ(ysrcp) కండువా కప్పుకుని ప్రచారం చేయాలని ఆదేశించారు. అలా చేయని వాలంటీర్లు జూన్ 5 అనంతరం విధుల్లో ఉండరని తేల్చి చెప్పారు. వాలంటీర్లు రాజీనామా చేసి ఈ పది రోజులు వైసీపీకి కోసం ప్రచారం చేయాలని దువ్వాడ శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. అలా చేయని వాళ్లు మాకు అవసరం లేదని, వాళ్లను వాలంటీర్లగా కొనసాగించమన్నారు. ఇప్పటికీ రాజీనామా చేయని వాళ్లు ఉంటే మే 3వ తేదీ లోపు రాజీనామా చేయాలని దువ్వాడ తెలిపారు. వైసీపీ కండువా వేసుకుని తాము చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశించారు. అలాంటి వాళ్లనే...తిరిగి వాలంటీర్ల(Volunteers) కొనసాగిస్తామన్నారు. రాజీనామా చెయ్యని వాళ్లు మాకు అక్కర్లేదని, అలాంటి వాళ్ల అవసరం కూడా లేదన్నారు. అతడి స్థానంలో మరొకరని నియమిస్తామన్నారు.

టీడీపీ విమర్శలు

దువ్వాడ శ్రీనివాస్ వీడియోను ట్వీట్ చేసిన టీడీపీ(TDP) విమర్శలు చేసింది. వాలంటీర్లు రాజీనామా చేసి, మెడలో వైసీపీ కండువా వేసి ప్రచారం చేయకపోతే, అంతు చూస్తాం అని దువ్వాడ బెదిరిస్తున్నారని ట్వీట్ చేసింది. "వాలంటీర్లకు మీ జగన్ (Jagan)అసలు రంగు తెలిసింది. మీరు ఎంత బెదిరించినా వాళ్లు రాజీనామా చేయరు. ఎందుకంటే వచ్చేది కూటమి ప్రభుత్వం. వారికి గౌరవ వేతనం పెంచడంతో పాటు, స్కిల్ డెవలప్మెంట్ చేసి, మరింత మంచి భవిష్యత్తు ఇచ్చేది చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan)" అని ట్వీట్ చేసింది.

వాలంటీర్లు ఏ గట్టునో?

ఏపీలో వైసీపీ(Ysrcp) అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించేందుకు వాలంటీర్లను ఉపయోగించారు. అయితే ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిన తర్వాత... వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించింది. వాలంటీర్లను(Volunteers) ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. అలాగే వారితో సంక్షేమ పథకాల(Welfare Schemes) పంపిణీని నిలిపివేసింది. దీంతో పెద్ద ఎత్తున వాలంటీర్లు రాజీనామా చేశారు. అయితే వైసీపీ నేతల ఒత్తిళ్ల మేరకు వాలంటీర్ల రాజీనామాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజీనామా(Volunteers Resign) చేసిన వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్న ఘటనలు ఉన్నాయి.

దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని, వారిని ప్రచారాలకు దూరంగా ఉంచాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ సుమారు 62 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వాలంటీర్లకు ఆ పదవులు ఇచ్చింది మేమేమని, ఎన్నికల సమయంలో తమ కోసం పనిచేయాలని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. ఈసీ ఆదేశాలతో వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం కావడంతో...వాళ్లను రాజీనామా చేయించి, ప్రచారంలో భాగం చేయాలని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాలంటీర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వాలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తామని హామీలు ఇస్తున్నాయి.

తదుపరి వ్యాసం