తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Rankings: మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‍గా టీమిండియా.. ఇంగ్లండ్‌పై విజయంతో రికార్డ్

ICC Rankings: మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‍గా టీమిండియా.. ఇంగ్లండ్‌పై విజయంతో రికార్డ్

Sanjiv Kumar HT Telugu

10 March 2024, 11:38 IST

  • Team India Top Place In ICC Rankings 2024: ఇండియన్ క్రికెట్ టీమ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానంలోకి చేరుకుంది. ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్ గెలవడంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ముందంజలోకి వచ్చేసింది.

మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‍గా టీమిండియా.. ఇంగ్లండ్‌పై విజయంతో రికార్డ్
మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‍గా టీమిండియా.. ఇంగ్లండ్‌పై విజయంతో రికార్డ్

మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‍గా టీమిండియా.. ఇంగ్లండ్‌పై విజయంతో రికార్డ్

Team India ICC Rankings 2024: ఇండియన్ క్రికెట్ టీమ్ మరోసారి సత్తా చాటింది. మళ్లీ అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోని మూడు ఫార్మాట్‌లలో టీమిండియా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌పై సిరీస్‌ను 4-1 తేడాతో గెలుపొందిన భారత్ ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్.. ఇంగ్లండ్‌తో జరిగిన మిగిలిన నాలుగు టెస్టుల్లో విజయం సాధించేందుకు గట్టిగా పోరాడి గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Mumbai Indians: తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్.. ముంబై ఇండియన్స్ సీనియర్ల గుస్సా

Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా ఎక్స్‌ట్రాల‌పై మాజీ క్రికెట‌ర్లు గ‌రంగ‌రం - రాహుల్ నీ ప‌నోడు కాదంటూ కామెంట్స్‌

Kl Rahul: కేఎల్ రాహుల్‌పై ల‌క్నో ఫ్రాంచైజ్ ఓన‌ర్ ఫైర్ - కెప్టెన్సీ ప‌ద‌వికి ఎస‌రుప‌డ‌నుందా?

Sunrisers Hyderabad: ఉప్పల్‍లో సన్‍రైజర్స్ సునామీ.. హెడ్, అభిషేక్ వీర కుమ్ముడుతో లక్నో చిత్తుచిత్తు.. 9.4 ఓవర్లలో గెలుపు

వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ, తాజాగా జరిగిన ధర్మశాలలో వరించిన విజయాలు టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి చేరుకునేందుకు దోహదపడ్డాయి. ఈ సిరీస్‌లో టీమిండియా అత్యద్భుతమైన ప్రదర్శన ఆస్ట్రేలియాను అధిగమించడంలో సహాయపడింది. ర్యాంకింగ్స్ పట్టికలో ఇప్పుడు 122 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇక 117 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానం సంపాదించుకోగా.. 111 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది.

క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా రెండో టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 విజేత ఆస్ట్రేలియా ప్రస్తుతం వెల్లింగ్‌టన్‌లో 172 పరుగుల విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్ ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 121 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా 118 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

అలాగే టీ20ల్లో భారత్‌ 266 రేటింగ్‌ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంటే ఇంగ్లాండ్‌ (256) రెండో స్థానంలో ఉంది. సెప్టెంబరు 2023 నుంచి జనవరి 2024 వరకు ఇది పరిస్థితి. దక్షిణాఫ్రికాతో 1-1తో డ్రా అయిన తర్వాత టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం రెండో స్థానానికి పడిపోయింది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్ టేబుల్‌లో భారత్ 68.51 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉంది. మ్యాచ్‌కి వచ్చిన తర్వాత, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సందర్శకులు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయ్యారు. జాక్ క్రాలే (108 బంతుల్లో 79, 11 ఫోర్లు, ఒక సిక్స్‌) ఇంగ్లండ్‌లో అత్యధిక స్కోరు చేశాడు. జానీ బెయిర్‌స్టో (29), జో రూట్ (26) మాత్రమే వారికి చెప్పుకోదగ్గ సహకారం అందించాడు.

కుల్దీప్ యాదవ్ (5/72), రవిచంద్రన్ అశ్విన్ (4/51) భారత బౌలింగ్ చార్టులలో అగ్రస్థానంలో ఉన్నారు. తమ తొలి ఇన్నింగ్స్‌లో, భారత్ మళ్లీ ఇంగ్లండ్‌ను కంట్రీ మైలు తేడాతో ఆలౌట్ చేసింది. ఓపెనింగ్ జోడీ కెప్టెన్ రోహిత్ శర్మ (162 బంతుల్లో 103- 13 ఫోర్లు, మూడు సిక్సర్స్), యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 57-5 ఫోర్లు, 3 సిక్సర్స్) చక్కని సహకారం అందించి ఆంగ్లేయులకు ఆటను కత్తిమీద సాములా చేశాడు.

ఇక డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ (103 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65), సర్ఫరాజ్ ఖాన్ (60 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 56) ఆకట్టుకున్నాడు. అయితే, చిన్న పతనం తర్వాత, తొమ్మిదో వికెట్‌లో కుల్దీప్ యాదవ్ (69 బంతుల్లో రెండు ఫోర్లతో 30), జస్‌ప్రీత్ బుమ్రా (64 బంతుల్లో రెండు ఫోర్లతో20) 49 పరుగుల భాగస్వామ్యాన్ని పెంచి, భారత్‌ను 477కు తీసుకెళ్లారు. అపోజిట్ టీమ్ కంటే 259 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది.

ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ (5/173) రాణించగా, టామ్ హార్ట్‌లీ, జేమ్స్ ఆండర్సన్ తలో రెండు వికెట్లు తీశారు. స్కిప్పర్ బెన్ స్టోక్స్ కూడా సిరీస్‌లో తన తొలి బంతికే వికెట్ తీశాడు. ఇంగ్లండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 259 పరుగుల లోటును తగ్గించుకోవాల్సిన పనిలో పడింది. జో రూట్ (128 బంతుల్లో 84, 12 ఫోర్లు) ఇంగ్లండ్‌తో పోరాడేందుకు ప్రయత్నించినప్పటికీ, అతనికి అవతలి ఎండ్ నుండి చాలా తక్కువ మద్దతు లభించింది.

జానీ బెయిర్‌స్టో (31 బంతుల్లో 39, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), టామ్ హార్ట్‌లీ (24 బంతుల్లో 20, నాలుగు బౌండరీలు) గౌరవ ప్రదమైన స్కోర్లు అందించారు. అయితే ఇంగ్లండ్‌ను 195 పరుగులకే టీమిండియా కట్టడి చేయడంతో రూట్ ఆ విపత్తును నివారించలేకపోయాడు. ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. దాంతో ఇంగ్లండ్ 4-1తో సిరీస్ కోల్పోయింది. అశ్విన్ తొలి సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇంగ్లిష్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేసి ఐదు వికెట్ల స్కోరుతో ముగించాడు. భారత్ బౌలర్లలో అశ్విన్ (5/77) చెలరేగిపోయాడు. కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.