తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా ఎక్స్‌ట్రాల‌పై మాజీ క్రికెట‌ర్లు గ‌రంగ‌రం - రాహుల్ నీ ప‌నోడు కాదంటూ కామెంట్స్‌

Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా ఎక్స్‌ట్రాల‌పై మాజీ క్రికెట‌ర్లు గ‌రంగ‌రం - రాహుల్ నీ ప‌నోడు కాదంటూ కామెంట్స్‌

09 May 2024, 12:54 IST

  • Sanjiv Goenka: స్టేడియంలోనే కేఎల్ రాహుల్‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓన‌ర్ సంజీవ్ గోయెంకా క్లాస్ ఇవ్వ‌డాన్ని మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ త‌ప్పుప‌డుతోన్నారు. రాహుల్ టీమ్ ఇండియా క్రికెట‌ర్ అని, సంజీవ్ గోయెంకా ప‌నివాడు కాద‌ని కామెంట్స్ చేస్తోన్నారు.

కేఎల్ రాహుల్‌, సంజీవ్ గోయెంకా
కేఎల్ రాహుల్‌, సంజీవ్ గోయెంకా

కేఎల్ రాహుల్‌, సంజీవ్ గోయెంకా

Sanjiv Goenka: బుధ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో ప‌ది వికెట్ల తేడాతో చిత్తుగా ఓట‌మిపాలైంది ల‌క్నో సూజ‌ర్ జెయింట్స్‌. ఈ మ్యాచ్‌లో ల‌క్నోవిధించిన 166 ప‌రుగుల టార్గెట్‌ను స‌న్‌రైజ‌ర్స్ మ‌రో 10. 2 ఓవ‌ర్లు మిగిలుండ‌గానే ఛేదించింది. స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ మెరుపుల‌తో ల‌క్నో బౌల‌ర్లు బ‌లైపోయారు. పోటీప‌డి ప‌రుగులు ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో త‌న జ‌ట్టు చిత్తుగా ఓట‌మి పాల‌వ్వ‌డాన్ని ల‌క్నో ఫ్రాంచైజ్‌ ఓన‌ర్ సంజీవ్ గోయెంకా జీర్ణించుకోలేక‌పోయాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

రాహుల్‌ను త‌ప్పుప‌డుతూ...

మ్యాచ్ అనంత‌రం స్టేడియంలోనే రాహుల్‌పై ఫైర్ అయ్యాడు సంజీవ్ గోయెంకా. ఓట‌మి ప‌ట్ల రాహుల్‌ను త‌ప్పుప‌డుతూ క్లాస్ పీకాడు. సంజీవ్‌కు స‌ర్ధిచెప్పేందుకు రాహుల్ ఎంత ప్ర‌య‌త్నించిన అత‌డు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోవ‌డం ఈ వీడియోలో క‌నిపిస్తోంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కొంత‌మంది నెటిజ‌న్లు కేఎల్ రాహుల్‌కు సంజీవ్ క్లాస్ ఇవ్వ‌డంలో త‌ప్పులేద‌ని అంటున్నారు. కానీ మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు కొంత‌మంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సంజీవ్ తీరును త‌ప్పుప‌డుతోన్నారు. రాహుల్‌కు మ‌ద్ద‌తునిస్తోన్నారు.

కెమెరాలు ఉన్నాయ‌న్న‌ది గుర్తుంచుకోవాలి...

స్టేడియంలో అంద‌రి ముందే రాహుల్‌ను సంజీవ్ గోయెంకా నిందించ‌డాన్ని మాజీ క్రికెట‌ర్ గ్రేమ్ స్మిత్ త‌ప్పుప‌ట్టాడు. ఇలాంటి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఎక్క‌డ ఉన్నామ‌న్న‌ది చూసుకుంటే బాగుంటుంది. చుట్టూ కెమెరాలు ఉన్నాయ‌నే సంగ‌తి గుర్తుంచుకోవాలి. నాలుగు గోడ‌ల మ‌ధ్యే ఈ చ‌ర్చ‌లు జ‌రిగితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేశారు. మ‌రికొంద‌రు మాజీ క్రికెట‌ర్లు కూడా రాహుల్ ప‌ట్ల సంజీవ్ గోయెంకా వ్య‌వ‌హ‌రించిన తీరు బాగాలేదంటూ చెబుతోన్నారు.

రాహుల్ ప‌నివాడు కాదు...

నెటిజ‌న్లు కూడా రాహుల్‌కే మ‌ద్ద‌తునిస్తున్నారు. కేఎల్ రాహుల్ నీ ప‌నివాడు కాదు...అత‌డు ఓ టీమిండియా క్రికెట‌ర్, అది నువ్వు తెలుసుకుంటే మంచిది అంటూ సంజీవ్ గోయెంకాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు షేమ్ ఆన్ గోయెంకా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

మార్వాడీ దందా కాదు...

క్రికెట్ అంటే మార్వాడీ దందా కాద‌ని మ‌రో నెటిజ‌న్ సంజీవ్ గోయెంకాపై ఫైర్ అయ్యాడు. ఓట‌మి బాధ‌పెట్ట‌డం స‌హ‌జ‌మే అంత మాత్ర‌నికే సీనియ‌ర్ ఇండియ‌న్ క్రికెట‌ర్‌ను కెమెరా ముందు ఇలా అవ‌మానించ‌డం ఏ మాత్రం బాగాలేద‌నే అన్నాడు.

కేఎల్ రాహుల్‌తో సంజీవ్ గోయెంకా ఏం మాట్లాడాడో తెలియ‌దు కానీ ఇలా ప‌బ్లిక్‌లో నిల‌దీయ‌డం మాత్రం త‌ప్పు అంటూ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. సంజీవ్ గోయెంకాపై కేఎల్ రాహుల్ ఫ్యాన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్నారు.

ధోనీ కూడా బ‌లి...

సంజీవ్ గోయెంకా ఎక్స్‌ట్రాల‌కు రాహుల్ మాద‌రిగానే 2016లో ధోనీ బ‌ల‌య్యాడు. 2016 ఐపీఎల్ సీజ‌న్‌లో రైజింగ్ పూణే జెయింట్స్ టీమ్‌కు ధోనీ సార‌థిగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సీజ‌న్‌లో పూణే దారుణంగా విఫ‌ల‌మైంది.

దాంతో ఈ ఓట‌మిల‌కు ధోనీనే కార‌ణ‌మ‌ని పూణే జెయింట్స్ ఫ్రాంచైజ్ ఓన‌ర్ అయిన సంజీవ్ గోయెంకా భావించారు. ధోనీని కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాడు. ధోనీ ఫిట్‌నెస్‌ను విమ‌ర్శిస్తూ సంజీవ్ గోయెంకా చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ప‌లువురు క్రికెట‌ర్లు ధోనీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ధోనీ రీతిలోనే ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా సంజీవ్ అహంకారానికి బ‌లైయ్యాడంటూ చెప్పాడు.

For latest cricket news, live score, IPL stay connected with HT Telugu
తదుపరి వ్యాసం