SRH vs MI: హైదరాబాద్‌లో ఐపీఎల్ సంబరం -సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - బోణీ కొట్టేది ఎవరో?
SRH vs MI: ఐపీఎల్‌లో నేడు(బుధవారం) ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
SRH vs MI: ఐపీఎల్ 2024లో నేడు ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ రెండు జట్లు ఇంకా ఐపీఎల్‌లో బోణీ చేయలేదు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ముంబై ఓటమి పాలైంది. కోల్‌కతా చేతిలో నాలుగు పరుగులు తేడాతో సన్‌రైజర్స్ గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. లాస్ట్ ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన సన్‌రైజర్స్ అనూహ్యంగా ఓటమి పాలై ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.
రోహిత్ శర్మ మినహా...
నేటి మ్యాచ్‌లో బోణీ కొట్టాలని ముంబై, హైదరాబాద్ టీమ్‌లు ఎదురుచూస్తున్నాయి. రెండు టీమ్‌లు తుది జట్లలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ, బ్రేవీస్ రాణించిన మిగిలిన బ్యాట్స్‌మెన్స్ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఇషాన్ కిషన్ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అతడికి మరో ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇషాన్ కిషన్ స్థానంలో…
ఇషాన్ కిషన్ స్థానంలో గుజరాత్‌పై మెరుపులు మెరిపించిన నమన్ ధీర్ ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య పూర్తిగా నిరాశపరిచాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో పాండ్య తీసుకున్న నిర్ణయాలు కూడా ఓటమికి కారణమయ్యాయి. సన్‌రైజర్స్‌పై బాల్‌తో పాటు బ్యాట్‌తో అదరగొట్టి తనపై వస్తోన్న విమర్శలకు పాండ్య ఎలా జవాబిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. బ
క్లాసెన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్...
తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది సన్‌రైజర్స్. ఈ సారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. కోల్‌కతాపై 29 బాల్స్‌లో ఎనిమిది సిక్సర్లతో చెలరేగాడు క్లాసెన్. నేటి మ్యాచ్‌కు అతడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉంది.
సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన ఇరవై కోట్ల ధరకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్‌తో పాటు కమిన్స్ ధారాళంగా పరుగులు ఇచ్చారు. బౌలింగ్ పరంగా మార్పులు చేస్లారా లేదా అన్నది చూడాల్సిందే.
ముంబైదే ఆధిపత్యం...
బలాబలాల పరంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ అధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 21 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 12 సార్లు విజయం సాధించగా, సన్‌రైజర్స్ తొమ్మిది సార్లు గెలుపొందింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో జరుగనున్న ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఇదే. నేటి మ్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ జట్టు అంచనా...
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ అగర్వాల్, మార్‌క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్
ముంబై జట్టు అంచనా...
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, నమన్ ధీర్, బ్రేవీస్, తిలక్ వర్మ, బుమ్రా, టిమ్ డేవిడ్, ములానీ, కోట్జీ, చావ్లా,