Hyderabad CSIR- NGRI Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు - పది, ఇంటర్ అర్హతతోనే, ముఖ్య వివరాలివే
Hyderabad CSIR-NGRI Recruitment 2024: హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- జాతీయ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా… Junior Secretariat Assistant ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
CSIR-National Geophysical Research Institute Jobs 2024 : పలు ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాద్ (Hyderabad) లోని సీఎస్ఐఆర్- జాతీయ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. జనవరి 26వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలను ఇక్కడ చూద్దాం…
ముఖ్య వివరాలు :
ఉద్యోగ ప్రకటన - సీఎస్ఐఆర్- జాతీయ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్
ఉద్యోగాలు - జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు - 09 (జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జననర్ 03), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 3), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్ - 03)) .
వయోపరిమితి - 28 -31 ఏళ్ల లోపు ఉండాలి.
అర్హతలు - ఇంటర్ లేదా పదో తరగతి పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ లో నైపుణ్యం ఉండాలి.
జీతం - రూ. 19,900 - రూ. 63,200
దరఖాస్తులు - ఆన్ లైన్
దరఖాస్తు రుసుం - రూ. 100
ఆన్ లైన్ దరఖాస్తులకు తుది గడువు - జనవరి 26, 2024 సాయంత్రం 6 గంటల లోపు.
హార్డ్ కాపీ సమర్పించేందుకు - ఫిబ్రవరి 9, 2024,సాయంత్రం 6 గంటల లోపు.
ఎంపిక విధానం - రాత పరీక్ష మరియు నైపుణ్య పరీక్షలు ఉంటాయి.
పరీక్ష విధానం - మొత్తం 200 మార్కులకు రాత పరీక్షలు ఉంటాయి. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి.
అధికారిక వెబ్ సైట్ - https://www.ngri.res.in