తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Cape Town Pitch: కేప్ టౌన్ పిచ్‌పై ఐసీసీ సీరియస్.. చెత్త పిచ్ అంటూ డీమెరిట్ పాయింట్

Cape Town Pitch: కేప్ టౌన్ పిచ్‌పై ఐసీసీ సీరియస్.. చెత్త పిచ్ అంటూ డీమెరిట్ పాయింట్

Hari Prasad S HT Telugu

09 January 2024, 16:26 IST

    • Cape Town Pitch: ఇండియా, సౌతాఫ్రికా రెండో టెస్ట్ ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోయిన కేప్ ‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియం పిచ్ పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ స్టేడియానికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.
కేప్ ‌టౌన్ లోని న్యూలాండ్స్ పిచ్
కేప్ ‌టౌన్ లోని న్యూలాండ్స్ పిచ్ (PTI)

కేప్ ‌టౌన్ లోని న్యూలాండ్స్ పిచ్

Cape Town Pitch: ఊహించినట్లే ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియడానికి కారణమైన కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం పిచ్ పై ఐసీసీ సీరియస్ అయింది. ఆ పిచ్‌కు సంతృప్తికరంగా లేదు అనే రేటింగ్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ గా ఇది నిలిచిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Sunrisers Hyderabad: ఉప్పల్‍లో సన్‍రైజర్స్ సునామీ.. హెడ్, అభిషేక్ వీర కుమ్ముడుతో లక్నో చిత్తుచిత్తు.. 9.4 ఓవర్లలో గెలుపు

SRH vs LSG: లక్నోను కట్టడి చేసిన హైదరాబాద్.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్.. నితీశ్, సన్వీర్ సూపర్ క్యాచ్‍లు

SRH vs LSG: పుట్టిన రోజున టాస్ ఓడిన ప్యాట్ కమిన్స్.. హైదరాబాద్ తుదిజట్టులో రెండు మార్పులు

IPL 2024 points table: ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 2024 లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇదీ

ఈ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. రెండు జట్లు నాలుగు ఇన్నింగ్స్ కలిపి కేవలం 107 ఓవర్లు మాత్రమే ఆడాయి. రెండో రోజు రెండో సెషన్ లోనే మ్యాచ్ పూర్తయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ పిచ్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఐసీసీకి తన నివేదిక అందజేశాడు.

బ్యాటింగ్ చాలా కష్టం: రిఫరీ రిపోర్ట్

న్యూలాండ్స్ పిచ్ పై బౌన్స్ అనూహ్యంగా ఉండటంతో బ్యాటింగ్ చాలా కష్టంగా మారినట్లు మ్యాచ్ రిఫరీ తన రిపోర్టులో వెల్లడించాడు. "న్యూలాండ్స్ లోని పిచ్ బ్యాటింగ్ కు చాలా కష్టంగా అనిపించింది. బాల్ చాలా వేగంగా, కొన్నిసార్లు ప్రమాదరకంగా బౌన్స్ అయింది. దీంతో షాట్లు ఆడటం కష్టంగా మారింది. కొంత మంది బ్యాటర్ల గ్లోవ్స్ కు బంతి తగిలింది. ఈ బౌన్స్ వల్లే చాలా వికెట్లు పడ్డాయి" అని బ్రాడ్ స్పష్టం చేశాడు.

ఐసీసీ ప్రమాణాలకు ఏమాత్రం అనుగుణంగా ఈ పిచ్ లేకపోవడంతో కేప్ టౌన్ స్టేడియానికి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇలా ఆరు డీమెరిట్ పాయింట్లు వస్తే ఏడాది పాటు ఆ స్టేడియంపై నిషేధం విధిస్తారు. 12 పాయింట్లకు చేరితే రెండేళ్ల నిషేధం విధిస్తారు. అంటే అక్కడ నిషేధం ముగిసే వరకూ ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు జరగవు.

నిజానికి ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే క్రికెట్ పండితులు ఈ పిచ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా పేస్ బౌలింగ్ కు అనుకూలించిన ఈ పిచ్ పై మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. తర్వాత ఇండియా 153 రన్స్ చేసింది. నిజానికి 153 పరుగుల దగ్గరే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.

ఇక రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా టీమ్ మార్‌క్రమ్ సెంచరీతో 172 రన్స్ చేయగలిగింది. 79 రన్స్ లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి సులువుగా చేజ్ చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కూడా ఈ పిచ్ పై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమకు ఇలాంటి పిచ్ లపై ఆడటానికి ఇబ్బందేమీ లేదని, అయితే ఇక నుంచి ఇండియాలో మొదటి రోజు నుంచే స్పిన్ అయ్యే పిచ్ లు ఎదురైనా విమర్శించకూడదని అన్నాడు.

ఈ టెస్ట్ తొలి రోజే 23 వికెట్లు పడటంతో పిచ్ పై ఆందోళన వ్యక్తమైంది. 1902 తర్వాత తొలి రోజే ఇన్ని వికెట్లు పడిన మరో టెస్టు లేదు. ఇక రెండో రోజు మొత్తంగా 107 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. దీంతో చరిత్రలో షార్టెస్ట్ టెస్ట్ గా ఈ మ్యాచ్ నిలిచిపోయింది.