తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature: వాట్సాప్‍లో ఇక ఫొటోలు, వీడియోలను క్యాప్షన్‍తో ఫార్వర్డ్ చేయొచ్చు! కొత్త ఫీచర్ రోల్అవుట్ షురూ

WhatsApp New Feature: వాట్సాప్‍లో ఇక ఫొటోలు, వీడియోలను క్యాప్షన్‍తో ఫార్వర్డ్ చేయొచ్చు! కొత్త ఫీచర్ రోల్అవుట్ షురూ

29 November 2022, 23:31 IST

    • WhatsApp New Feature: వాట్సాప్‍లో ఫొటోలు, వీడియోలు, జిఫ్‍లను క్యాప్షన్‍తోనే ఫార్వర్డ్ చేసే సదుపాయం వచ్చేస్తోంది. పూర్తి వివరాలివే..
WhatsApp New Feature: వాట్సాప్‍లో ఇక ఫొటోలు, వీడియోలు. క్యాప్షన్‍తో ఫార్వర్డ్
WhatsApp New Feature: వాట్సాప్‍లో ఇక ఫొటోలు, వీడియోలు. క్యాప్షన్‍తో ఫార్వర్డ్

WhatsApp New Feature: వాట్సాప్‍లో ఇక ఫొటోలు, వీడియోలు. క్యాప్షన్‍తో ఫార్వర్డ్

WhatsApp New Feature: యూజర్లకు కొత్త సదుపాయాలు కల్పించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా వరుసగా ఫీచర్లను యాడ్ చేస్తోంది. ప్రపంచంలోనే పాపులర్ మెసేజింగ్ యాప్‍గా ఉన్న వాట్సాప్.. కొత్తగా మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్‍లో ఫొటోలు, వీడియోలు, జిఫ్‍లను ఇతరులకు ఫార్వార్డ్ చేసే సమయంలో చాలా మంది ఓ సమస్యను ఎదుర్కొని ఉంటారు. ఫొటోలు, వీడియోలను ఫార్వర్డ్ చేస్తే.. దానికి ఉండే క్యాప్షన్ మాత్రం సెండ్ అవదు. క్యాప్షన్‍ను సపరేట్‍గా పంపాల్సి వస్తుంది. అయితే వాట్సాప్ ఇప్పుడు దీనికి పరిష్కారాన్ని తెచ్చింది. క్యాప్షన్‍తో వీడియోలు, ఫొటోలను ఫార్వర్డ్ చేసే సదుపాయాన్ని తీసుకొస్తోంది.

ఉపయోగమిదే..

WhatsApp New Feature: వాట్సాప్‍లో రిసీవ్ చేసుకున్న ఏదైనా ఫొటో కానీ, వీడియోను కానీ ఇతరులకు ఫార్వార్డ్ చేస్తే.. దానికి ఉండే క్యాప్షన్ సెండ్ అయ్యేది కాదు. ఫొటో లేదా వీడియో మాత్రమే ఫార్వర్డ్ అయ్యేది. కావాలనుకుంటే క్యాప్షన్‍ను వేరుగా పంపాలి. అయితే క్యాప్షన్‍తో సహా వీడియోలు, ఫొటోలను ఫార్వర్డ్ చేసే సదుపాయాన్ని ఇప్పుడు తీసుకొచ్చింది వాట్సాప్. కొన్ని రోజులు దీన్ని టెస్ట్ చేసిన వాట్సాప్.. ఇప్పుడు యూజర్లందరికీ అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే రోల్అవుట్‍ను మొదలుపెట్టింది. రానున్న వారాల్లో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కొందరు ఐఓఎస్ యూజర్లకు క్యాప్షన్‍తో ఫార్వర్డ్ సదుపాయం వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అతిత్వరలోనే యాడ్ అవుతుంది.

ఎలా వినియోగించాలి!

WhatsApp New Feature: సాధారణంగా ఎవరైనా ఫొటో లేదా వీడియో పంపిస్తే.. వేరే వాళ్లకు ఫార్వర్డ్ చేయాలంటే దానిపై ట్యాప్ చేసి పట్టుకుంటాం. ఆ తర్వాత ఫార్వర్డ్ ఆప్షన్ చూపిస్తుంది. అనంతరం ఎవరికి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నామో వారి కాంటాక్టును సెలెక్ట్ చేసుకుంటాం. ఈ పద్ధతిలో ఫార్వర్డ్ చేస్తే దానికి ఉండే క్యాప్షన్ వెళ్లేది కాదు. అయితే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే క్యాప్షన్ కూడా ఫార్వర్డ్ అవుతుంది. అయితే, కావాలంటే క్యాప్షన్‍ను తొలగించే అవకాశం కూడా ఉంటుంది. ఫార్వర్డ్ సెండ్ చేసే ముందే x అనే సింబల్ కలిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి క్యాప్షన్‍ను తొలగించవచ్చు.

కాగా, ఎవరి నంబర్ కు వారే మెసెజ్‍లు పంపుకునేలా కూడా కొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రకటించింది. ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ రోల్అవుట్‍ను కూడా మొదలుపెట్టింది.

టాపిక్