WhatsApp Message Yourself: మెసేజింగ్ యాప్ వాట్సాప్‍కు కొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్‌ను ఇండియా యూజర్లకు లాంచ్ చేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. కొంతకాలంగా వాట్సాప్ ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తోందని వార్తలు రాగా.. ఇప్పుడు ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది.. ఎలా వినియోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
వాట్సాప్‍కు మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ వచ్చేస్తోందని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ కొన్ని వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.
WhatsApp Message Yourself: ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీ నంబర్‌కు మీరే వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. నోట్స్, రిమైండర్స్, షాపింగ్ లిస్ట్ లను రాసుకోవడంతో పాటు ముఖ్యమైన టెక్స్ట్ ను సేవ్ చేసుకునేందుకు ఈ వాట్సాప్ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు సేవ్ చేసుకోవాలనుకున్న వాటిని వాట్సాప్ ద్వారా మీ నంబర్ కు మీరే సెండ్ చేసుకోవచ్చు. దీంతో చాట్‍లో అవి స్టోర్ అయి ఉంటాయి.
WhatsApp Message Yourself: మేసెజ్ యువర్ సెల్ఫ్ ను ఉపయోగించేందుకు ముందుగా వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ లోకి వెళ్లాలి. అన్ని కాంటాక్ట్ ల కంటే టాప్‍లో మీ నంబర్ కనిపిస్తుంది. బ్రాకెట్‍లో సెల్ఫ్ అని ఉంటుంది. ఆ నంబర్ పై క్లిక్ చేసి.. మీకు మీరే మెసేజ్‍లు సెండ్ చేయవచ్చు. దీంతో చాట్స్ లో మీ నంబర్ కూడా కనిపిస్తుంది. కొన్ని వారాల్లోనే ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
WhatsApp New Features: వాట్సాప్‍లో కమ్యూనిటీస్ ఫీచర్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. దీంతో వేర్వేరు గ్రూప్‍లను ఒకే కమ్యూనిటీలో యాడ్ చేసుకునే సదుపాయం వచ్చింది. గ్రూప్‍లో 1024 మంది యూజర్ల వరకు ఉండేలా లిమిట్‍ను పెంచింది వాట్సాప్. వీడియో కాల్‍లోనూ ఒకేసారి 32 మంది పార్పిసిపెంట్లు పాల్గొనేలా ఫీచర్ ను లాంచ్ చేసింది.