తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: డిసెంబర్ 31 తర్వాత ఈ 49 స్మార్ట్‌ఫోన్‍లలో వాట్సాప్ బంద్.. పూర్తి లిస్ట్ ఇదే..

WhatsApp: డిసెంబర్ 31 తర్వాత ఈ 49 స్మార్ట్‌ఫోన్‍లలో వాట్సాప్ బంద్.. పూర్తి లిస్ట్ ఇదే..

27 December 2022, 20:50 IST

    • WhatsApp to Stop Working on These Mobiles: ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాతి నుంచి కొన్ని పాత మోడల్ ఫోన్‍లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మోడళ్ల ఫుల్ లిస్ట్ ఇదే.
WhatsApp: డిసెంబర్ 31 తర్వాత ఈ 49 స్మార్ట్‌ఫోన్‍లలో వాట్సాప్ బంద్
WhatsApp: డిసెంబర్ 31 తర్వాత ఈ 49 స్మార్ట్‌ఫోన్‍లలో వాట్సాప్ బంద్ (Bloomberg)

WhatsApp: డిసెంబర్ 31 తర్వాత ఈ 49 స్మార్ట్‌ఫోన్‍లలో వాట్సాప్ బంద్

WhatsApp to Stop Working on These Smartphones: వాట్సాప్ సాధారణంగా కొన్ని పాత మోడళ్ల స్మార్ట్‌ఫోన్‍లకు క్రమంగా సపోర్టును నిలిపివేస్తుంటుంది. దీంతో ఆ ఫోన్‍లలో ఇక వాట్సాప్ వాడే అవకాశం ఉండదు. తాజాగా డిసెంబర్ 31 తర్వాతి నుంచి మరో 49 మొబైళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అంటే కొత్త ఏడాది నుంచి ఈ మొబైళ్లలో ఇక వాట్సాప్ వాడలేరు. యాపిల్, సామ్‍సంగ్, హువావే, ఎల్‍జీతో పాటు మరికొన్ని సంస్థలకు చెందిన ఫోన్లు ఈ లిస్టులో ఉన్నాయి. అయితే ఇవన్నీ చాలా పాత మోడళ్లు. ప్రస్తుత కాలంలో వీటిని ఎవరూ వాడుతుండకపోవచ్చు. మరికొన్ని మొబైళ్లు అసలు ఇండియాలో లభించనివే ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది యూజర్లపై ప్రభావం ఉండకపోవచ్చు. కాగా, డిసెంబర్ 31వ తేదీ తర్వాత వాట్సాప్ సేవలు నిలిచిపోయే స్మార్ట్‌ఫోన్‍ల పూర్తి లిస్ట్ ఇదే. ఓ లుక్కేయండి.

డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ బంద్ అయ్యే ఫోన్లు ఇవే

  • యాపిల్ ఐఫోన్ 5
  • యాపిల్ ఐఫోన్ 5సీ
  • సామ్‍సంగ్ గెలాక్సీ ఏస్ 2
  • సామ్‍సంగ్ గెలాక్సీ కోర్
  • సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్2
  • సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్3 మినీ
  • సామ్‍సంగ్ గెలాక్సీ ట్రెండ్ II
  • సామ్‍సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
  • సామ్‍సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 2
  • సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్
  • సోనీ ఎక్స్‌పీరియా మిరో
  • సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్
  • ఎల్‍జీ ఎనాక్ట్
  • ఎల్‍జీ ల్యూసిడ్ 2
  • ఎల్‍జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‍డీ
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎఫ్3
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎఫ్3 క్యూ
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎఫ్5
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎఫ్6
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎఫ్7
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్2 II
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్3 II
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్3 II డ్యుయల్
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్4 II
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్4 II డ్యుయల్
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్5
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్5 డ్యుయల్
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్5 II
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్7
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్7 II
  • ఎల్‍జీ ఆప్టిమస్ ఎల్7 II డ్యుయల్
  • ఎల్‍జీ ఆప్టిమస్ నైట్రో హెచ్‍డీ
  • హువావే అసెండ్ డీ
  • హువావే అసెండ్ డీ1
  • హువావే అసెండ్ డీ2
  • హువావే అసెండ్ జీ740
  • హువావే అసెండ్ మేట్
  • హువావే అసెండ్ పీ1
  • హెచ్‍టీసీ డిజైన్ 500
  • మెమో జెడ్‍టీఈ వీ956
  • క్యూడ్ ఎక్స్‌ఎల్
  • లెనోవో ఏ820
  • అర్కోస్ 53 ప్లాటినమ్
  • గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్‍టీఈ
  • గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్‍టీఈ
  • వికో సింక్ ఫైవ్
  • వికో డార్క్ నైట్ జీటీ

ఈ స్మార్ట్ ఫోన్‍లో ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ బంద్ అయిపోతుంది. అయితే ఇవి చాలా పాత మోడళ్లు. ప్రస్తుతం ఎవరూ వాడడం లేదని చెప్పొచ్చు. అలాగే వీటిలో కొన్ని అసలు ఇండియాలోనే లాంచ్ అవలేదు. ఒకవేళ ఇప్పటికీ ఒకవేళ ఎవరైనా ఈ మొబైళ్లను వినియోగిస్తుంటే ఇక 2023 జనవరి 1 నుంచి వాటిలో వాట్సాప్ వాడలేరు. ఈ పాత మోడళ్లకు ఎప్పటి నుంచో అప్‍డేట్లు రాని కారణంగా ప్రైవసీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగానే సపోర్టును వాట్సాప్ నిలిపివేస్తోంది.

టాపిక్