తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Features: వాట్సాప్‍కు ఈ రెండు ఫీచర్లు యాడ్ అయ్యాయి.. చెక్ చేసుకోండి

WhatsApp New Features: వాట్సాప్‍కు ఈ రెండు ఫీచర్లు యాడ్ అయ్యాయి.. చెక్ చేసుకోండి

13 December 2022, 16:32 IST

    • WhatsApp New Features: వాట్సాప్ ఇటీవల ప్రకటించిన రెండు ఫీచర్లు.. ఇప్పుడు భారత్‍లో యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ మెసేజ్ యువర్ సెల్ఫ్, అవతార్స్ సదుపాయాలు యాడ్ అయ్యాయి. ఇవి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి.
WhatsApp New Features: వాట్సాప్‍కు ఈ రెండు ఫీచర్లు యాడ్ అయ్యాయి.. చెక్ చేసుకోండి
WhatsApp New Features: వాట్సాప్‍కు ఈ రెండు ఫీచర్లు యాడ్ అయ్యాయి.. చెక్ చేసుకోండి

WhatsApp New Features: వాట్సాప్‍కు ఈ రెండు ఫీచర్లు యాడ్ అయ్యాయి.. చెక్ చేసుకోండి

WhatsApp New Features: వాట్సాప్ ఇటీవల మెసేజ్ యువర్ సెల్ఫ్, అవతార్ ఫీచర్లను ప్రకటించింది. వీటి రోల్అవుట్‍ను మొదలుపెట్టినట్టు తెలిపింది. ఆ రెండు ఫీచర్లు ఇప్పుడు ఇండియాలోని దాదాపు యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చాయి. కొత్త ఫీచర్లను వాట్సాప్ ఇటీవల దూకుడుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మెసేజ్ యువర్ సెల్ఫ్, అవతార్ సదుపాయాలను రూపొందించింది. టెస్టింగ్ పూర్తయ్యాక అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అసలు ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయి.. ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

మీకు మీరే మెసేజ్ చేసుకునేలా..

WhatsApp Message Yourself: మీ నంబర్‌కు మీరే టెక్ట్స్, ఫొటోలు, వీడియోలు సెండ్ చేసుకునేందుకు ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్‍లో ఏదైనా టెక్ట్స్, ఫొటో, వీడియో, జిఫ్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇది మంచి ఆప్షన్‍గా ఉంటుంది. మీ నంబర్‌కు మీరే సెండ్ చేసుకోవడం ద్వారా.. చాట్ క్రియేట్ అయి అందులోనే ఉంటాయి. ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఏ సమాచారాన్ని అయిన టెక్ట్స్ రూపంలో వాట్సాప్‍లో సేవ్ చేసుకోవాలంటే ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ బాగా ఉపయోగపడుతుంది.

ఎలా ఉపయోగించాలంటే..

ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. అందులో కాంటాక్ట్స్ లిస్ట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్ని కాంటాక్ట్స్ కంటే టాప్‍లో మీ ఫోన్ నంబర్ కనిపించి.. దాని పక్కన బ్రాకెట్స్ లో (you) అని ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి మీకు మీరే మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు.

అవతార్ ఫీచర్..

WhatsApp Avatars: వాట్సాప్‍కు అవతార్స్ ఫీచర్ కూడా యాడ్ అయింది. ఇటీవలే రోల్అవుట్ మొదలుపెట్టగా.. ఇప్పుడు యాజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ యాప్‍ సెట్టింగ్స్ (Settings) లో అవతార్ (Avatar) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి క్రియేట్ అవతార్‌ను ఎంపిక చేసుకొని మీకు నచ్చిన విధంగా మార్పులు చేసుకోవచ్చు. విభిన్నమైన హెయిర్ స్టైల్స్, డ్రెస్సులు, కలర్లతో అవతార్ ను క్రియేట్ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా అవతార్స్ అన్నీ కస్టమైజ్ అవుతాయి. కస్టమైజ్ చేసిన విధంగా ఉండే విభిన్న ఎమోషన్లతో ఉండే అవతార్లను వాట్సాప్ ద్వారా ఎవరికైనా సెండ్ చేయవచ్చు. ఎవరి చాట్‍లోకి అయినా వెళ్లి.. టెక్ట్స్ బాక్స్ పక్కన ఉండే ఎమోజీ సింబల్‍ను క్లిక్ చేస్తే.. జిఫ్స్, స్టిక్కర్స్ ఐకాన్లు కనిపిస్తాయి. స్టిక్కర్స్ సింబల్ పక్కనే ఈ అవతార్ ఐకాన్ కొత్తగా యాడ్ అయింది. అక్కడ ఉండే విభిన్నమైన అవతార్లలో ఏదైనా సెండ్ చేయవచ్చు. వాట్సాప్ అవతార్ ఫీచర్ గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

టాపిక్