WhatsApp Avatars: పాపులర్ మెసేజింగ్ ప్లాట్‍ఫామ్ వాట్సాప్‍కు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేస్తోంది. మెటా అవతార్స్ ఫీచర్ ఇక వాట్సాప్‍కు కూడా యాడ్ కానుంది. వాట్సాప్ పేరెంట్ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Meta CEO Mark Zuckerberg) ఈ విషయాన్ని వెల్లడించారు. యూజర్లందరికీ అవతార్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే కొందరు యూజర్లకు అవతార్స్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాట్సాప్ బీటా వెర్షన్ వాడుతున్న వారికి అవతార్స్ ఫీచర్ ఉంది. అయితే ఇక నుంచి యూజర్లందరికీ అవతార్స్ సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొస్తోంది. అతిత్వరలో సాధారణ యూజర్లకు కూడా యాడ్ అవుతుంది. ఇందులో 36 కస్టమ్ అవతార్స్ ఉంటాయి. వాటిని ఎడిట్ చేసుకొని ఇష్టమైన రీతిలో క్రియేట్ చేసుకోవచ్చు. సెండ్ చేసుకోవచ్చు.. ప్రొఫైల్ పిక్చర్ గానూ సెట్ చేసుకోవచ్చు. మరి ఈ ఫీచర్ మీకు వచ్చాక అవతార్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
WhatsApp Avatars: డిజిటల్ అవతార్లను ఇష్టమైనట్టు కస్టమైజ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అంటే అవతార్‌కు విభిన్న రకాల దుస్తులు, హెయిర్ స్టైల్స్, ఫేషియల్ ఫీచర్లు, రంగులు యాడ్ చేయవచ్చు. మెటా పరిధిలోని మెసెంజర్, ఫేస్‍బుక్, ఇన్‍స్టాగ్రామ్‍లో ఇప్పటికే ఈ అవతార్స్ సదుపాయం అందుబాటులో ఉంది. ఇప్పుడు దీన్ని వాట్సాప్‍కు తీసుకొస్తోంది మెటా. అవతార్స్ యాక్షన్స్, ఎమోషన్స్ ఆధారంగా ఉండే 36 కస్టమ్ స్టిక్కర్ల నుంచి దేన్నయినా యూజర్ ఎంపిక చేసుకోవచ్చు. అవతార్ గా క్రియేట్ చేయవచ్చు. సృష్టించిన అవతార్లను ద్వారా ఇతరులకు సెండ్ చేయవచ్చు. ప్రొఫైల్ ఫొటోగానూ సెట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
How to Create WhatsApp Avatar: అవతార్స్ ఫీచర్‌ను వాట్సాప్ రోల్అవుట్ చేస్తోంది. అతిత్వరలోనే అందరికీ యాడ్ అవుతుంది. మీకు ఈ ఫీచర్ వచ్చాక అవతార్‌ను క్రియేట్ చేసేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.
WhatsApp Avatars: క్రియేట్ చేసుకున్న అవతార్స్.. చాట్స్‌లోని స్టిక్కర్స్ ఆప్షన్ పక్కన అవతార్స్ సెక్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి సెండ్ చేయవచ్చు. చాట్‍లో మనం మెసేజ్ చేసే టెక్స్ట్ బాక్స్ పక్కన ఎమెజీ సింబల్‍పై క్లిక్ చేయాలి. అక్కడ GIF, స్టిక్సర్స్ ఆప్షన్స్ పక్కన అవతార్ సెక్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు క్రియేట్ చేసిన అవతార్స్ కనిపిస్తాయి. కావాలంటే అక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
అప్‍డేట్ ద్వారా వాట్సాప్‍కు ఈ అవతార్స్ ఫీచర్ వస్తుంది. ఒకవేళ మీరు పాత వెర్షన్ వాట్సాప్ వాడుతున్నట్టయితే ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లో అప్‍డేట్ చేసుకోవచ్చు. ఐఓఎస్ యూజర్లు యాపిల్ స్టోర్లో అప్‍డేట్ చేసుకోండి.