తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Features: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు; కొత్త డివైజ్ లో ఓపెన్ చేయాలంటే

WhatsApp new features: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు; కొత్త డివైజ్ లో ఓపెన్ చేయాలంటే

HT Telugu Desk HT Telugu

14 April 2023, 15:34 IST

  • ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను వాట్సాప్ (WhatsApp) అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. తాజాగా, యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత లక్ష్యంగా మరో అప్ డేట్ ను తీసుకువచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ షార్ట్ మెసేజింగ్, ఇమేజెస్ అండ్ వీడియోస్ షేరింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో సెక్యూరిటీ ఫీచర్ (security feature) ను ఆవిష్కరించింది. యూజర్లు తమ కంటెంట్, చాట్ హిస్టరీలను మరింత సురక్షితంగా భద్ర పర్చుకునే దిశగా ఈ సెక్యూరిటీ ఫీచర్ ను రూపొందించింది.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

Account Protect : ఎక్స్టా లేయర్ ప్రొటెక్షన్

వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు నిత్యావసరంగా మారింది. అత్యంత రహస్య సంభాషణలకు కూడా వాట్సాప్ ఇప్పుడు వేదిక. ఈ నేపథ్యంలో తమ వాట్సాప్ డేటా సురక్షితంగా, ఇతరుల కంటపడకుండా ఉండాలని యూజర్లంతా కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే వాట్సాప్ (WhatsApp) యాప్ ఫోర్ గ్రౌండ్లో, అదేవిధంగా యాప్ బ్యాక్ గ్రౌండ్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ల (security features) ను ప్రారంభిస్తోంది. తాజాగా వాట్సాప్ అకౌంట్ ప్రొటెక్ట్ (Account Protect) అనే సెక్యూరిటీ ఫీచర్ ను ఆవిష్కరించింది. యూజర్ ఎపుడైనా, తన పాత డివైజ్ లో నుంచి కొత్త డివైజ్ లోకి తన వాట్సాప్ అకౌంట్ (WhatsApp account) ను మార్చాలనుకుంటే ఈ సెక్యూరిటీ ఫీచర్ తెరపైకి వస్తుంది. కొత్త డివైజ్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలనుకుంటే, పాత డివైజ్ లోని వాట్సాప్ లో ఆ విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. కొత్త డివైజ్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయడానికి పాత డివైజ్ లోని వాట్సాప్ లో యూజర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ ప్రొటెక్ట్ (Account Protect) అనే సెక్యూరిటీ ఫీచర్ (security feature) ద్వారా యూజర్ కు తెలియకుండా, వేరే ఎవరు కూడా ఆ యూజర్ వాట్సాప్ అకౌంట్ ను మరో డివైజ్ లో ఓపెన్ చేయలేరు.

Device Verification: డివైజ్ వెరిఫికేషన్

Account Protect సెక్యూరిటీ ఫీచర్ తో పాటు వాట్సాప్ డివైజ్ వెరిఫికేషన్ (Device Verification) అనే మరో సెక్యూరిటీ ఫీచర్ ను కూడా ప్రారంభించింది. ఈ ఫీచర్ యూజర్ల వాట్సాప్ అకౌంట్ ను మొబైల్ డివైజ్ మాల్ వేర్ (mobile device malware) నుంచి కాపాడుతుంది. ఈ మాల్ వేర్ (malware) ద్వారా, యూజర్ కు తెలియకుండా, ఆ యూజర్ వాట్సాప్ ఖాతా (WhatsApp account) ను ఓపెన్ చేసి, ఆ యూజర్ పేరుతో మెసేజెస్ పంపించవచ్చు. ఇది యూజర్ కు ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశముంది. డివైజ్ వెరిఫికేషన్ (Device Verification) ఫీచర్ ద్వారా ఈ మాల్ వేర్ ను అడ్డుకోవచ్చు. ఇవి కాకుండా, కీ ట్రాన్స్ పరెన్సీ (Key Transparency), టూ స్టెప్ వెరిఫికేషన్ (two-step verification). ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ (end-to-end encrypt) వంటి సెక్యూరిటీ ఫీచర్లు (security features) వాట్సాప్ లో ఉన్నాయి.