WhatsApp New UI: వాట్సాప్ కొత్తకొత్తగా.. లుక్ పూర్తిగా మారుతోంది!-whatsapp testing new cleaner user interface for the android app ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp Testing New Cleaner User Interface For The Android App

WhatsApp New UI: వాట్సాప్ కొత్తకొత్తగా.. లుక్ పూర్తిగా మారుతోంది!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2023 01:27 PM IST

WhatsApp New UI: యాప్ కొత్త యూజర్ ఇంటర్ఫేస్‍ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త యూఐతో వాట్సాప్ లుక్ పూర్తిగా మారుతుందని సమాచారం.

WhatsApp New UI: వాట్సాప్ కొత్తకొత్తగా.. లుక్ పూర్తిగా మారుతోంది!
WhatsApp New UI: వాట్సాప్ కొత్తకొత్తగా.. లుక్ పూర్తిగా మారుతోంది! (HT_PRINT)

WhatsApp New UI: ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp). దీన్ని నిత్యం కోట్లాది మంది వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో యూజర్లకు కొత్త సదుపాయాలను ఇచ్చేందుకు వాట్సాప్ క్రమంగా ఫీచర్లను తెస్తూనే ఉంటుంది. అయితే, ‘వాట్సాప్’ లుక్ త్వరలోనే మారనుందని ఓ రిపోర్టు బయటికి వచ్చింది. ఆండ్రాయిడ్ యాప్‍నకు కొత్త యూజర్ యూజర్ఫేస్ (User Interface - UI)ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఈ యూఐ మరింత క్లీన్‍గా ఉంటుంది. ఫీచర్లను యూజర్లు సులభంగా ఉపయోగించుకునే విధంగా ఉండనుందని తెలుస్తోంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

బాటమ్‍లో ట్యాబ్స్

WhatsApp New UI: ఆండ్రాయిడ్ యాప్ యూఐను పూర్తిగా మార్చేందుకు వాట్సాప్ టెస్ట్ చేస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో (WABetaInfo) రిపోర్ట్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ యాప్ బాటమ్‍లో నేవిగేషన్ బార్‌ను వాట్సాప్ యాడ్ చేస్తుందని వెల్లడించింది. బాటమ్ బార్‌లో చాట్స్, కమ్యూనిటీస్, స్టేటస్, కాల్స్ ట్యాబ్స్ ఉంటాయని ఫొటోలను విడుదల చేసింది. దీని ద్వారా యూజర్లు వాట్సాప్‍ను వాడుకోవడం మరింత సులభతరం అవుతుందని పేర్కొంది. దాదాపు వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ కూడా ఐఓఎస్ యాప్‍లా ఉంటుందని తెలుస్తోంది. బీటా అప్‍డేట్ 2.23.8.4 ఆండ్రాయిడ్ వెర్షన్‍లో ఈ కొత్త యూఐను వాట్సాప్ పరీక్షిస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది.

వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ కొత్త యూఐ (Photo Credit: WABetaInfo)
వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ కొత్త యూఐ (Photo Credit: WABetaInfo)

కొందరు వాట్సాప్ బీటా యూజర్లకు ఇప్పటికే ఈ కొత్త ఇంటర్ఫేస్‍తో కూడిన వాట్సాప్ అప్‍డేట్ వచ్చింది. బీటా యూజర్లు డౌన్‍లోడ్ చేసుకొని వాడవచ్చు. ఒకవేళ సాధారణ యూజర్ అయితే ఇంకొంత కాలం వేచిచూడాలి. బీటా యూజర్లు టెస్ట్ చేసి.. బగ్స్ ఏవీ లేవని నిర్ధారించాక యూజర్లందరికీ కొత్త అప్‍డేట్‍ను వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంది. స్టేబల్ వెర్షన్‍ను విడుదల చేస్తుంది.

త్వరలో ఎడిట్ ఫీచర్

WhatsApp Edit Feature: ఎడిట్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. సెండ్ చేసిన తర్వాత కూడా మెసేజ్‍ను ఎడిట్ చేసేలా ఈ ఫీచర్‌ను తీసుకురావాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం మెసేజ్‍లో ఏదైనా తప్పు దొర్లితే డిలీట్ చేయడమే.. మళ్లీ మెసేజ్ పంపడమో చేయాల్సి వస్తోంది. ఈ మెసేజ్ ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. పంపిన మెసేజ్‍ను కూడా ఎడిట్ చేయవచ్చు. మళ్లీ సెండ్ చేయాల్సిన పని తప్పుతుంది. మరి ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందో చూడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం