తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Uniparts India Ipo: యూనిపార్ట్స్ ఐపీఓకు విశేష స్పందన

Uniparts India IPO: యూనిపార్ట్స్ ఐపీఓకు విశేష స్పందన

HT Telugu Desk HT Telugu

01 December 2022, 16:46 IST

    • ఇంజినీరింగ్ పార్ట్స్, సొల్యూషన్స్ అందించే కంపెనీ యూని పార్ట్స్ ఇండియా(Uniparts India) ఐపీఓ బుధవారం ప్రారంభమైంది. ఈ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూని పాార్ట్స్ ఇండియా(Uniparts India) ఐపీఓ(initial public offer - IPO) నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు మదుపర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రెండో రోజు మధ్యాహ్నానికే 100% సబ్ స్క్రిప్షన్ సాధించింది. Uniparts India IPO

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Uniparts India IPO: ఇంజినీరింగ్ పార్ట్స్, సొల్యూషన్స్ కంపెనీ

యూని పార్ట్స్ ఇండియా(Uniparts India) సంస్థ ప్రధానంగా వ్యవసాయం, మైనింగ్, నిర్మాణ రంగాల్లో ఇంజినీరింగ్ విడి భాగాలను అందిస్తుంది. ఈ సెగ్మెంట్లో ఇది మార్కెట్ లీడర్ గా ఉంది. ఈ Uniparts India సంస్థ విక్రయాల్లో 82% వాటా విదేశాలదే. గత మూడు సంవత్సరాలుగా సంస్థ ఆదాయం, లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. 1994 సెప్టెంబర్ లో ఈ సంస్థ ప్రారంభమైంది. 25కి పైగా దేశాల్లో Uniparts Indiaకు కస్టమర్లు ఉన్నారు.

Uniparts India IPO: ఐపీఓ కు మంచి స్పందన

ఐపీఓ(IPO) ప్రారంభమైన రెండో రోజే ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయింది. డిసెంబర్ 2న ఈ ఐపీఓ(IPO) ముగుస్తుంది. ఐపీఓ ప్రారంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ రూ. 251 కోట్లను సమీకరించింది. డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3.50 గంటల వరకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 166 శాతం, ఎన్ఐఐ(NII)ల నుంచి 235 శాతం, క్యూఐబీ(QIB)ల నుంచి 1 శాతం సబ్ స్క్రైబ్ అయినట్లుగా బీఎస్ఈ(BSE) వెబ్ సైట్ వెల్లడించింది.

Uniparts India IPO grey market: గ్రే మార్కెట్లో..

గురువారం ఈ సంస్థ షేరు గ్రే మార్కెట్లో రూ. 68 ల ప్రీమియంతో లభిస్తోంది. అంటే ఇష్యూ ధర కన్నా రూ. 68 ఎక్కువకు గురువారం ఈ షేరు గ్రే మార్కెట్లో ట్రేడ్ అవుతోందని అర్థం. ఈ ఐపీఓ ద్వారా మొత్తం 1.44 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ మార్కెట్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఐపీఓ(IPO) ద్వారా రూ. 836 కోట్లను సమీకరించాలన్నది యూనిపార్ట్స్ ఇండియా లక్ష్యం. ఈ ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్(OFS)’ కేటగిరీలో ఉంది.

Uniparts India IPO details: ఐపీఓ(IPO) వివరాలు..

  • ఐపీఓ(IPO) అందుబాటులో ఉండేది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు.
  • ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 548 నుంచి రూ. 577.
  • లాట్ సైజ్ 25 షేర్లు.
  • స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేది డిసెంబర్ 12,2022 న.

టాపిక్