తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే..

Gold rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

01 October 2022, 6:07 IST

    • Gold rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు శనివారం పెరిగాయి. ఆ లెక్కలు ఇలా ఉన్నాయి.
మీ నగరాల్లో నేటి బంగారం ధర ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధర ఇలా..

మీ నగరాల్లో నేటి బంగారం ధర ఇలా..

Gold rate Today : దేశంలో బంగారం ధరలు శనివారం కూడా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 46,650కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,400గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 2500 పెరిగి, రూ. 4,66,500కి చేరింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 280 వృద్ధి చెంది.. రూ. 50,900కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,620గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 2800 పెరిగి.. రూ. 5,09,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,900గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,970గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,240గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,680గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,930గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,900గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,950గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,900గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,700గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 600 పెరిగి.. 57,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 56,400గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 62,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 57,000.. బెంగళూరులో రూ. 62,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం కాస్త పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 110 పెరిగి.. రూ 22,680కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 22,570గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 22,680గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)