తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Iphone 7 : 16ఏళ్ల నాటి ఐఫోన్​.. మెర్సిడెస్​​ బెంజ్​ రేంజ్​లో ధర..!

Apple iPhone 7 : 16ఏళ్ల నాటి ఐఫోన్​.. మెర్సిడెస్​​ బెంజ్​ రేంజ్​లో ధర..!

Sharath Chitturi HT Telugu

17 February 2023, 11:59 IST

    • Apple iPhone 7 : 16ఏళ్ల నాటి యాపిల్​ ఐఫోన్​ ధర.. మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​యూవీ ప్రైజ్​తో సమానంగా ఉండనుంది! షాక్​ అయ్యారా? అసలు కథ ఏంటంటే..
Apple introduced the iPhone 7 in 2007
Apple introduced the iPhone 7 in 2007

Apple introduced the iPhone 7 in 2007

Old iPhone for auction : 'యాపిల్​ ఐఫోన్​'.. ప్రపంచంలో అత్యధిక డిమాండ్​ ఉన్న స్మార్ట్​ఫోన్స్​లో ఇదొకటి. ఇంకా చెప్పాలంటే.. ఈ బ్రాండ్​కు ప్రత్యేక ఫ్యాన్​ బేస్​ ఉంటుంది. ప్రీమియం స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తుంది యాపిల్​ సంస్థ. డిమాండ్​, డిజైన్​, ఫీచర్స్​కు తగ్గట్టుగానే.. ఐఫోన్​ ధర కూడా ప్రీమియంగా ఉంటుంది. 'కొత్త ఐఫోన్​ కొనాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిందే,' అంటూ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​ కూడా పేలుతుంటాయి. ఇక ఇప్పుడు.. యాపిల్​ ఐఫోన్​కు సంబంధించిన వార్త ఒకటి వైరల్​గా మారింది. ఈ ఐఫోన్​ మోడల్​ ధర.. దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​యూవీతో సమానంగా ఉండటం ఇందుకు కారణం.

ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

ఆక్షన్​కు యాపిల్​ ఐఫోన్​ 7..

కరెన్​ గ్రీన్​ అనే టాటూ ఆర్టిస్ట్​.. తన వద్ద ఉన్న యాపిల్​ ఐఫోన్​ 7ను ఆక్షన్​కు పెట్టింది. ఇది 16ఏళ్ల నాటి మోడల్​. 2007లో ఇంట్రడక్టరీ ప్రైజ్​ కింద 599 డాలర్లకు దీనిని విక్రయించింది యాపిల్​ సంస్థ. తొలి టచ్​ స్క్రీన్​ మోడల్​, తొలి 2ఎంపీ కెమెరా మోడల్​తో పాటు మరెన్నో కొత్త ఫీచర్స్​తో ఇది అప్పట్లో మార్కెట్​లో లాంచ్​ అయ్యింది.

iPhone at Mercedez Benz price : ఆక్షన్​కు చెందిన వెబ్​సైట్​ ప్రకారం.. ఐఫోన్​ 7కి 18,505 డాలర్లు విలువ చేసే బిడ్డింగ్స్​ వచ్చాయి. ఫిబ్రవరి 19 వరకు ఆక్షన్​లో పాల్గొనవచ్చు. ఇప్పటివరకు ఈ మోడల్​కు 16 బిడ్స్​ దాఖలయ్యాయి. చివరికి ఈ యాపిల్​ ఐఫోన్​ 7.. 50వేల డాలర్లకు అమ్ముడుపోతుందని అంచనాలు ఉన్నాయి. ఇది మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​యూవీతో సమానం.

16ఏళ్ల నాటి ఐఫోన్​కు ఇంత డిమాండ్​ ఎందుకు ఉంది? అని మీరు అనుకోవచ్చు. ఇదొక అన్​ప్యాక్​డ్​ డివైజ్​. ఐఫోన్​ బాక్స్​ మీద కవర్​ కూడా తీయలేదు! కరెన్​ గ్రీన్​కు.. తన స్నేహితుల నుంచి ఈ యాపిల్​ ఐఫోన్​ 7 గిఫ్ట్​గా అందింది. అయితే.. అప్పటికే ఆమె ఓ కొత్త స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేయడంతో దీనిని తెరిచే అవసరం రాలేదు.

కొన్నప్పటికీ.. వాడలేరు!

Apple iPhone 7 : 50వేల డాలర్లు ఖర్చు చేసి ఈ ఐఫోన్​ను కొన్నప్పటికీ.. దీనిని వాడుకోలేరు! ఇది ఏటీ అండ్​ టీ అనే నెట్​వర్క్​ మీద వర్క్​ చేస్తుంది. దీని అమెరికాలో కనుమరుగైపోయింది. కానీ కొనుగోలు చేసిన వ్యక్తికి.. 'వింటేజ్​ ఐఫోన్​ ప్రాడక్ట్​'ను సొంతం చేసుకున్న ఫీల్​ వస్తుంది!

ఐఫోన్​ 15 సిరీస్​..

ఈ ఏడాది.. ఐఫోన్​ 15 సిరీస్​ను తీసుకురానుంది యాపిల్​ సంస్థ. దీనిపై ఐఫోన్​ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఐఫోన్​ 15లో టైప్​-సీ పోర్ట్​ ఉండొచ్చు.