Smartphones to gift on Valentine's Day : అదిగో వాలెంటైన్స్​ డే.. ఇవిగో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్ గిఫ్ట్స్​!-here is the list of best smartphones to gift on valentine s day iphone 14 pro max and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Here Is The List Of Best Smartphones To Gift On Valentine's Day, Iphone 14 Pro Max And More

Smartphones to gift on Valentine's Day : అదిగో వాలెంటైన్స్​ డే.. ఇవిగో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్ గిఫ్ట్స్​!

Sharath Chitturi HT Telugu
Feb 11, 2023 07:42 AM IST

Best smartphones to gift on Valentine's Day : వాలెంటైన్స్​ డే నేపథ్యంలో మీకు ఇష్టమైనవారికి మంచి స్మార్ట్​ఫోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే.. మార్కెట్​లో ఉన్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ను మీకోసం మేము తీసుకొచ్చాము. చూసేయండి..

అదిగో వాలెంటైన్స్​ డే.. ఇవిగో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్ గిఫ్ట్స్​!
అదిగో వాలెంటైన్స్​ డే.. ఇవిగో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్ గిఫ్ట్స్​! (Bloomberg)

Best smartphones to gift on Valentine's Day : వాలెంటైన్స్​ డేకి ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు ఫీవర్​ కనిపిస్తోంది. తాము ప్రేమించే వారి కోసం చాలా మంది ఇప్పటికే మంచి మంచి గిఫ్ట్స్​ కొనేసి, వాలెంటైన్స్​ డే కోసం ఎదురుచూస్తున్నారు! మరి మీరు? ఏ గిఫ్ట్​ కొనాలి? అని తెగ ఆలోచించేస్తున్నారా? అయితే.. వాలెంటైన్స్​ డే కోసం మీకు ఇష్టమైనవారికి ఇచ్చేందుకు ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​ గిఫ్ట్స్​పై మేము ఓ లిస్ట్​ రూపొందించాము. ఆ వివరాలు..

ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​.. శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23..

iPhone 14 pro max : ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​:- ఇందులో 6.7 ఇంచ్​ సూపర్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే ఉంటుంది. 1టీబీ స్టోరేజ్​తో కూడిన ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ దీని సొంతం. ఇందులో 48ఎంపీ ప్రైమరీ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది.

Samsung Galaxy S22 Ultra price : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​22 అల్ట్రాకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇందులో 8కే రికార్డింగ్​ చేయగలిగే కెమెరా సెటప్​ ఉండటం విశేషం. ఇప్పుడున్న స్మార్ట్​ఫోన్స్​లో ఇదే అత్యధికం. శాంసంగ్​ ఎస్​ పెన్​తో ఫొటోలు, వీడియోలను ఎడిట్​ కూడా చేయవచ్చు.

Nothing Phone 1 : నథింగ్​ ఫోన్​ 1:- ఇందులో 6.55 ఇంచ్​ పుల్​ హెచ్​డీ+ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. కార్నింగ్​ గొరిల్లా గ్లాస్​ 5 సైతం ఉంది. 6ఎన్​ఎం క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 778జీ+ తో పాటు 4500ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్​766తో కూడిన డ్యూయెల్​ కెమెరా సెటప్​ దీని సొంతం.

Nothing Phone 2 పై జోరుగా ఊహాగానాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Realme 10 Pro Plus 5G features : రియల్​మీ 10 ప్రో ప్లస్​ 5జీ:- 10 ప్రో సిరీస్​లో ది బెస్ట్​ అని ఈ గ్యాడ్జెట్​కు గుర్తింపు లభించింది. ఇందులో 6.7ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే, మీడియాటెక్​ డైమెన్సిటీ 1080 చిప్​సెట్​, 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

Samsung Galaxy F23 : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 :- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 750జీ ప్రాసెసర్​, 6జీబీ ర్యామ్​, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం? వీటిల్లో మీ బడ్జెట్​కు తగ్గ స్మార్ట్​ఫోన్​ని చూసుకుని, మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్​ ఇచ్చేయండి!

WhatsApp channel