తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 961 అప్

Stock market news: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 961 అప్

04 October 2022, 9:17 IST

    • Stock market news: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం నష్టపోగా.. నేడు పుంజుకున్నాయి.
నిన్న సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు
నిన్న సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు (PTI)

నిన్న సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు

Stock market news: Stock market today: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 989 పాయింట్లు పెరిగి 57,777 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 299 పాయింట్లు పెరిగి 17,187 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే

టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, విప్రో, టీసీఎస్, మారుతీ సుజుకీ తదితర స్టాక్స్ ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.66 శాతం, లార్సెన్ 2.51 శాతం, టాటా స్టీల్ 2.54 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.62 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.18 శాతం, ఎస్‌బీఐ 2.43 శాతం లాభపడ్డాయి.

Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే

టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ తదితర స్టాక్స్ ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు నేడు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నష్టాల్లో ఉన్న ఉప సూచీలు ఈరోజు ఒక్కటీ లేదు.

Pre market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 717.84 పాయింట్లు పెరిగి 57,506.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 260.10 పాయింట్లు పెరిగి 17,147.45 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిన్న సోమవారం సెషన్ ముగింపు సమయంలో ఆటో, ఎఫ్‌.ఎమ్‌.సి.జి., బ్యాంకింగ్ స్టాక్‌లలో భారీ అమ్మకాలతో సెన్సెక్స్ 638 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 638.11 పాయింట్లు క్షీణించి 57,426.92 పాయింట్ల వద్దకు చేరుకుంది.  శుక్రవారం సెన్సెక్స్ 1016.96 పాయింట్లు లాభపడింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన ప్రకటన తర్వాత శుక్రవారం మార్కెట్లు బలమైన ర్యాలీని చవిచూశాయి. ఆశించిన రీతిలోనే  ద్రవ్య విధాన కమిటీ పాలసీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు లేదా 0.50 శాతం పెంచి 5.90 శాతంగా మార్చింది. 

సోమవారం అమెరికా డాలర్‌తో రూపాయి 42 పైసలు క్షీణించి 81.82 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలు, ముడి చమురు ధరల పెరుగుదల రూపాయి సెంటిమెంటును దెబ్బతీసింది.