తెలుగు న్యూస్  /  బిజినెస్  /  September Gst Collections:సెప్టెంబర్ లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

September GST collections:సెప్టెంబర్ లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

HT Telugu Desk HT Telugu

01 October 2022, 22:22 IST

  • September GST collections: సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. మూడో అత్యుత్తమ వసూళ్లతో ఈ సెప్టెంబర్ నెల రికార్డు సృష్టించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

September GST collections: సెప్టెంబర్ నెలలో The Goods and Services Tax (GST) ఆదాయం రూ. 1.48 లక్షల కోట్లు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలతో పోలిస్తే అది 26% అధికం. ఈ సంవత్సరం వరుసగా గత ఏడు నెలలుగా జీఎస్టీ ఆదాయం రూ. 1.40 లక్షల కోట్లు దాటింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ.. జీఎస్టీ ఆదాయం రికార్డు స్థాయిలో రావడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli: త్వరలో మార్కెట్లోకి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ‘గో డిజిట్’ ఐపీఓ; ఈ ఐపీఓతో కోహ్లీకి కళ్లు చెదిరే లాభం

Aztec IPO: ఓపెన్ అయిన కొన్ని గంటల్లో ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయిన ఎస్ఎంఈ ఐపీఓ.. జీఎంపీ కూడా భారీగానే..

TBO Tek IPO: టీబీఓ టెక్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన; జీఎంపీ చూస్తే షాకే

Smartphone brand : ఇండియాలో నెంబర్​.1 స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​గా వివో! సామ్​సంగ్​ డౌన్​..

September GST collections: వచ్చే నెలలో 1. 5 లక్షల కోట్లు..

ఈ సెప్టెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం రూ. 1,47,686 కోట్లుగా ఉంది. అంటే, 1.50 లక్షల కోట్లకు రూ. 2,314 కోట్లు మాత్రమే తక్కువ. అందువల్ల, అక్టోబర్ లో జీఎస్టీ ఆదాయం కచ్చితంగా రూ. 1.50 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అదీకాక, అక్టోబర్ నెలంతా పండుగ సీజన్ కావడంతో, ప్రైమరీ కొనుగోళ్లు అత్యధిక సంఖ్యలో జరుగుతాయని, తద్వారా జీఎస్టీ ఆదాయం కూడా ఆ మేరకు పెరుగుతుందని ఆశిస్తున్నారు.

September GST collections: జనవరిలో మొదటి సారి..

జీఎస్టీ ఆదాయం తొలిసారి ఈ సంవత్సరం జనవరిలో రూ. 1.40 లక్షల కోట్లు దాటింది. ఆ నెల రూ 1,40,986 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నెలను మినహాయిస్తే.. మార్చి నెల నుంచి జీఎస్టీ ఆదాయం రూ. 1.40 లక్షల కోట్లు దాటింది. ఫిబ్రవరి నెలలో మాత్రం రూ. 1,33,026 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తంగా జీఎస్టీ ఆదాయం రూ. 8, 93,334 కోట్లుగా ఉంది.

September GST collections: ఒక్క రోజులో అత్యధికంగా..

ఒక్క రోజులో అత్యధిక జీఎస్టీ ఆదాయం లెక్కలు చూస్తే.. ఒక్క రోజులో అత్యధిక ఆదాయం సమకూరింది ఈ సంవత్సరం జులై 20 వ తేదీన. ఆ ఒక్క రోజే రూ. 57,846 కోట్ల ఆదాయం సమకూరింది. ఆ తరువాత అత్యధిక ఆదాయం సమకూరిన రెండో రోజుగా సెప్టెంబర్ 20వ తేదీ నిలిచింది. ఆ రోజు జీఎస్టీ ఆదాయం రూ. 49,453 కోట్లు.