తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Virat Kohli: త్వరలో మార్కెట్లోకి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ‘గో డిజిట్’ ఐపీఓ; ఈ ఐపీఓతో కోహ్లీకి కళ్లు చెదిరే లాభం

Virat Kohli: త్వరలో మార్కెట్లోకి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ‘గో డిజిట్’ ఐపీఓ; ఈ ఐపీఓతో కోహ్లీకి కళ్లు చెదిరే లాభం

HT Telugu Desk HT Telugu

10 May 2024, 17:37 IST

  • Virat Kohli-backed Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన గో డిజిట్ ఐపీఓ మే 15న మార్కెట్లోకి రానుంది. ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు మే 17వ తేదీ వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. మే 14న ఈ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపులు జరగనున్నాయి. ఈ సంస్థలో 2020లో విరాట్ కోహ్లీ రూ. 2.5 కోట్లు పెట్టుబడి పెట్టారు.

విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన గో డిజిట్ ఐపీఓ
విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన గో డిజిట్ ఐపీఓ (AFP)

విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన గో డిజిట్ ఐపీఓ

Go Digit IPO: గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఐపీఓ మే 15వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఈ ఐపీఓకు మే 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ గో డిజిట్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.258 నుంచి రూ.272 మధ్య నిర్ణయించారు. ఈ షేర్ ఫేస్ వాల్యూ రూ. 10. మే 14న ఈ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపులు జరగనున్నాయి. ఐపీవో ఫ్లోర్ ప్రైస్ ఈక్విటీ షేర్ల ముఖ విలువకు 25.80 రెట్లు, క్యాప్ ధర ఈక్విటీ షేర్ల ముఖ విలువకు 27.20 రెట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

లాట్ సైజ్ 55 షేర్స్

ఈ ఐపీఓ లాట్ సైజ్ 55 ఈక్విటీ షేర్లు. ఆ తర్వాత 55 ఈక్విటీ షేర్ల మల్టిపుల్స్ లో బిడ్డింగ్ చేయవచ్చు. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB)కు ఐ పబ్లిక్ ఇష్యూలో 75 శాతానికి తగ్గకుండా, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 15 శాతానికి మించకుండా, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతానికి మించకుండా వాటాలను రిజర్వు చేశారు. మే 21వ తేదీన షేర్స్ అలాట్మెంట్ ఉంటుంది. మే 22న షేర్లు అలాట్ కాని వారికి కంపెనీ రీఫండ్ ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. రీఫండ్ చేసిన మరుసటి రోజే కేటాయింపుదారుల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. ఈ నెల 23న ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీకి కళ్లు చెదిరే లాభం

వచ్చే వారం ఇన్సూరెన్స్ స్టార్టప్ గో డిజిట్ లిస్టింగ్ తర్వాత సెలబ్రిటీ కపుల్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ 271% రాబడిని పొందనున్నారు. ఈ కంపెనీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రూ. 2.5 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. గరిష్ట ఇష్యూ ధర అయిన రూ. 278 తో ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే, వీరి పెట్టుబడి విలువ రూ. 9.25 కోట్లకు చేరుతుంది. విరాట్ కోహ్లీ 2020 జనవరిలో ఒక ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఒక్కో యూనిట్ ధర రూ .75 చొప్పున 2,66,667 షేర్లను కొనుగోలు చేశాడు. ఇందులో అతని మొత్తం పెట్టుబడి కంపెనీలో రూ .2 కోట్లు. అనుష్క శర్మ కూడా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక్కో షేరుకు రూ.75 చొప్పున 66,667 షేర్లను కొనుగోలు చేసింది.

గో డిజిట్ ఐపీఓ జీఎంపీ

గ్రే మార్కెట్లో గో డిజిట్ ఐపీఓ షేర్లు ఆఫర్ ధర రూ.258-272తో పోలిస్తే ఇప్పటికే సుమారు రూ.50 ప్రీమియం (GMP)తో ట్రేడ్ అవుతున్నాయి. గో డిజిట్ ఐపీఓలో రూ.1,125 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ, 54,766,392 షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS ) ఉన్నాయి. ఇన్వెస్టర్లు గరిష్టంగా 55 ఈక్విటీ షేర్లకు, ఆ తర్వాత 55 షేర్ల మల్టిపుల్స్ కు బిడ్లు వేయవచ్చు.

తదుపరి వ్యాసం