
(1 / 5)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ నేడు (మే 1) తన 36వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్, ఆమె భర్త విరాట్ కోహ్లీ.. అనుష్కకు విషెస్ చెప్పారు.
(Instagram)
(2 / 5)
అనుష్కకు ఇన్‍స్టాగ్రామ్ ద్వారా విరాట్ కోహ్లీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రపంచానికి వెలుగు నువ్వే అంటూ లవ్లీగా విష్ చేశారు.
(Instagram)
(3 / 5)
అనుష్కను చాలా ప్రేమిస్తున్నానంటూ విరాట్ కోహ్లీ పోస్ట్ చేశారు. “ఒకవేళ నేను నిన్ను కనుక్కోలేకపోయి ఉంటే.. అన్నీ కోల్పోయే వాడిని. నా ప్రేమకు హ్యాపీ బర్త్‌డే. మా ప్రపంచానికి నువ్వే వెలుగువు. మేం నిన్ను చాలా ప్రేమిస్తున్నాం” అని విరాట్ కోహ్లీ పోస్ట్ చేశారు.
(Instagram)
(4 / 5)
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు 2017 డిసెంబర్ 11వ తేదీన వివాహం జరిగింది. 2021 జనవరిలో వామిక అనే అమ్మాయి వారికి జన్మించారు.

(5 / 5)
విరాట్, అనుష్క ఇటీవలే 2024 ఫిబ్రవరి 15న రెండో సంతానంగా అబ్బాయిని పొందారు. అతడికి అకాయ్ అని ఈ స్టార్ దంపతులు నామకరణం చేశారు.
ఇతర గ్యాలరీలు