తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Super Meteor 650 Revealed: ఎన్ ఫీల్డ్ నుంచి సూపర్ మీటియో 650

Royal Enfield Super Meteor 650 revealed: ఎన్ ఫీల్డ్ నుంచి సూపర్ మీటియో 650

HT Telugu Desk HT Telugu

08 November 2022, 19:41 IST

    • Royal Enfield Super Meteor 650 revealed: బైక్ ప్రియులు, ముఖ్యంగా రాయల్ ఎన్ ఫీల్డ్ లవర్స్ కు శుభవార్త. చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న Royal Enfield Super Meteor 650 ను సంస్థ ఆవిష్కరించింది.  రెండు మోడల్స్ లో వస్తున్న ఈ బైక్ ధర రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉంటుంది.
 పారిస్ లో జరుగుతున్న EICMA 2022 రాయల్ ఎన్ ఫీల్డ్ ఆవిష్కరించిన Super Meteor 650
పారిస్ లో జరుగుతున్న EICMA 2022 రాయల్ ఎన్ ఫీల్డ్ ఆవిష్కరించిన Super Meteor 650 (Royal Enfield)

పారిస్ లో జరుగుతున్న EICMA 2022 రాయల్ ఎన్ ఫీల్డ్ ఆవిష్కరించిన Super Meteor 650

Royal Enfield Super Meteor 650 revealed: పారిస్ లో జరుగుతున్న EICMA 2022 షోలో మంగళవారం రాయల్ ఎన్ ఫీల్డ్ తన ఫ్లాగ్ షిప్ మోడల్ Super Meteor 650 ను ఆవిష్కరించింది.

Royal Enfield Super Meteor 650 revealed: ఆధునిక ఫీచర్లు, డైనమిక్ లుక్స్..

ఈ న్యూ జనరేషన్ Super Meteor 650 ఇప్పటికే మార్కెట్లో ఉన్న Continental GT 650 కన్నా ఆధునిక ఫీచర్లు, డైనమిక్ లుక్స్ తో రూపొందింది. ఈ బైక్ కు సంబంధించి డీలర్ షిప్ ట్రైనింగ్ సెషన్ కూడా ముగిసింది. త్వరలో భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ బైక్ రెండు మోడల్స్ లో రానుంది. అవి ఒకటి Super Meteor 650 కాగా, మరొకటి Super Meteor 650 Tourer.

Royal Enfield Super Meteor 650 revealed: ఐదు వైబ్రంట్ కలర్స్ లో..

ఈ Super Meteor 650 ఐదు డైనమిక్ రంగుల్లో వస్తోంది. అవి Astral green, Astral Black, Astral Blue, Interstellar Grey, Interstellar Green. అలాగే Super Meteor 650 Tourer రెండు రంగుల్లో అందుబాటులోకి వస్తోంది. అవి Celestial Blue and Celestial Red.

Royal Enfield Super Meteor 650 revealed: స్పెసిఫికేషన్స్..

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో Interceptor 650, Continental GT 650 ల్లో వాడిన ఇంజిన్ నే ఉపయోగించారు. కాకపోతే, డిజైన్ లో కొంత మార్పు చేశారు. హెడ్, సైడ్ పానల్స్ డిజైన్ ను మ్యాటీ బ్లాక్ లో మరింత క్లాసీగా మార్చారు. అలాగే, ఈ బైక్ 47 Ps of maximum power at 7,250 rpm and a peak torque output of 52 Nm at 5,650 rpm ఇస్తుంది. ఇందులో ముందు 43 mm upside down forks ను, వెనుక twin gas-charged shock absorbers ను ఏర్పాటు చేశారు. అలాగే, ఈ బైక్ లో డ్యుయల్ చానెల్ ఏబీఎస్ (dual-channel ABS)తో పాటు, ముందు 320 ఎంఎం డిస్క్, వెనుక 300 ఎంఎం డిస్క్ బ్రేక్ లను ఏర్పాటు చేశారు.

Royal Enfield Super Meteor 650 revealed: యాక్సెసరీస్..

ఈ బైక్ లో న్యూ జనరేషన్ డిజైన్స్ తో యాక్సెసరీస్ ఉన్నాయి. హ్యాండిల్ బార్ ఎండ్ మిర్రర్స్, machined wheels, డీలక్స్ ఫూట్ పెగ్, LED ఇండికేటర్లు, deluxe touring dual-seat, touring windscreen, passenger backrest లను ఏర్పాటు చేశారు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

టాపిక్