తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Remittances From Overseas: భారీగా పెరిగిన Nri నిధులు

Remittances from overseas: భారీగా పెరిగిన NRI నిధులు

HT Telugu Desk HT Telugu

10 January 2023, 21:09 IST

  • Remittances from overseas: విదేశాల్లోని భారతీయులు ఇండియాలోని తమ వారికి పంపించే నిధుల మొత్తం 2022లో భారీగా పెరిగింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Rahul Singh)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

Remittances from overseas: భారత్ లోని తమ వారికి విదేశాల్లోని భారతీయలు పంపించిన డబ్బులు(remittances sent to the country by overseas Indians) అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, 2022లో 12% పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

Remittances from overseas: 100 బిలియన్లు

2022 సంవత్సరంలో భారత్ లోని తమ వారికి విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు 100 బిలియన్ డాలర్ల (10 వేల కోట్ల డాలర్లు) కన్నా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు పంపించారని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మల సీతారామన్ పాల్గొన్నారు. ప్రవాస భారతీయులే మన దేశానికి నిజమైన రాయబారులని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. విదేశాల్లోని భారతీయులు సాధ్యమైనంత వరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలని ఆమె సూచించారు. చైనా, యూరోపియన్ యూనియన్ల తరువాత మల్టీ నేషనల్ కంపెనీల తదుపరి లక్ష్యం భారతే కావాలని, ఆ దిశగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె వెల్లడించారు. ఎన్ ఆర్ ఐలు కూడా భారత్ లో వ్యాపార, వాణిజ్యాల్లో భాగస్వామ్యులు కావాలని ఆమె కోరారు.

Remittances from overseas: విదేశాలకు వెళ్లరనుకున్నారు..

కొరోనా మహమ్మారి తరువాత భారతీయులు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడానికి భయపడ్తారనే వార్త బాగా ప్రచారమైందని, అయితే, అది అబద్దమని భారతీయులు రుజువు చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ, డిజిటల్ టెక్నాలజీ, ఆటో మొబైల్స్, సెమీ కండక్టర్ డిజైనింగ్, ఫార్మా తదితర రంగాల్లో భారతీయ నిపుణుల ఆధిపత్యమే కొనసాగుతోందని నిర్మలసీతారామన్ ప్రశంసించారు