తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Smart City Near Gurugram: 8 వేల ఎకరాల్లో రిలయన్స్ స్మార్ట్ సిటీ

Reliance smart city near Gurugram: 8 వేల ఎకరాల్లో రిలయన్స్ స్మార్ట్ సిటీ

HT Telugu Desk HT Telugu

08 November 2022, 21:09 IST

  • Reliance smart city near Gurugram: రిలయన్స్ సంస్థ కు చెందిన MET City (METL) గురుగ్రామ్ దగ్గరలో అత్యాధునిక సౌకర్యాలతో స్మార్ట్ సిటీని నిర్మిస్తోంది. ఈ METL రిలయన్స్ కు 100 శాతం సబ్సిడయిరీ.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (MINT_PRINT)

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ

Reliance smart city near Gurugram: రిలయన్స్ కు 100 శాతం సబ్సిడయిరీ అయిన MET City (METL) 8 వేల ఎకరాల్లో గురుగ్రామ్ సమీపంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీని నిర్మిస్తోంది. ఇప్పటికే జపాన్ కు చెందిన ఒక సంస్థ తమ మెడికల్ డివైజెస్ యూనిట్ కోసం శంకుస్థాపన కూడా చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Offers on Honda cars : మే నెలలో.. ఈ హోండా వెహికిల్స్​పై సూపర్​ ఆఫర్స్​!

Vivo Y18 launch : వివో నుంచి రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Reliance smart city near Gurugram: రిలయన్స్ ప్రకటన

మోడల్ ఎకనమిక్ టౌన్ షిప్ లిమిటెడ్(Model Economic Township Limited -MET City) గురుగ్రామ్ దగ్గరలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీని నిర్మిస్తోందని రిలయన్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ MET City అనేది ఒక Japan Industrial Township (JIT). ఈ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ లో జపాన్ కు చెందిన 4 లీడింగ్ ఇండస్ట్రీస్ తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అందులో ఒకటైన Nihon Kohden ఇప్పటికే తమ మెడికల్ డివైజెస్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన కూడా చేసింది.

Reliance smart city near Gurugram: నాలుగు జపాన్ కంపెనీలు..

ఈ MET Cityలో జపాన్ లో ప్రముఖ కంపెనీలైన Nihon Kohden తో పాటు Panasonic, Denso, T-Suzuki భాగస్వామ్యులుగా ఉన్నాయి. దాదాపు 400 ఇండస్ట్రియల్ యూనిట్ల నిర్మాణానికి అవకాశం ఉన్న ఈ స్మార్ట్ సిటీలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నివాస సముదాయాలను కూడా నిర్మిస్తారు. ఇక్కడ యూనిట్లను స్టార్ట్ చేయాలనుకునే కంపెనీలకు నేరుగా వచ్చి పనులు ప్రారంభించుకునేలా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మెట్ సిటీ సీఈఓ గోపాల్ తెలిపారు.