తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dividends Higher Than Fd Rates: ఈ 5 స్టాక్స్‌పై ఎఫ్‌డీ కంటే ఎక్కువ డివిడెండ్

Dividends higher than FD rates: ఈ 5 స్టాక్స్‌పై ఎఫ్‌డీ కంటే ఎక్కువ డివిడెండ్

HT Telugu Desk HT Telugu

27 October 2022, 21:09 IST

    • Dividend stocks: కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా డివిడెంట్ రూపంలో రాబడి ఇస్తాయి.
Dividend paying stocks: ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి ఇచ్చే కంపెనీలు (ప్రతీకాత్మక చిత్రం)
Dividend paying stocks: ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి ఇచ్చే కంపెనీలు (ప్రతీకాత్మక చిత్రం) (PTI)

Dividend paying stocks: ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి ఇచ్చే కంపెనీలు (ప్రతీకాత్మక చిత్రం)

Dividend stocks: డివిడెండ్ చెల్లించే స్టాక్స్ షేర్ హోల్డర్స్‌కు త్రైమాసిక ఫలితాల సమయంలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లతో పోలిస్తే లాంగ్ టెర్మ్ ఇన్వెస్టర్లకు ఈ డివిడెండ్ బోనస్ ఇన్‌కమ్ అన్నట్టు.

మార్కెట్ పతనమవుతున్న సందర్భంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ అమ్మేయకుండా డివిడెండ్ వస్తుందన్న ఆశతో వాటిని అంటిపెట్టుకుంటారు. ఇటీవల ఆర్ఈసీ లిమిటెడ్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తన షేర్ హోల్డర్లకు రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర రూ. 96.50గా ఉంది. దీని డివిడెండ్ రాబడి దాదాపు 5 శాతం కంటే ఎక్కువే. స్వల్పకాలం లేదా ఏడాది కాలంలో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ నవరత్న ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ రూ. 13.30 డివిడెండ్ ప్రకటించింది. అంటే సగటు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటు 6 శాతం కంటే కూడా ఇది చాలా ఎక్కువే.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేట్ల కంటే కూడా ఎక్కువ డివిడెండ్ రాబడి ఇచ్చే ఐదు ఇండియన్ స్టాక్స్ ఇక్కడ చూద్దాం.

1. SAIL or Steel Authority of India Ltd: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)

పబ్లిక్ రంగ మెటల్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో షేరుకు రూ. 8.75 మేర డివిడెండ్ చెల్లించింది. మొత్తంగా మూడు సందర్భాల్లో ఈ డివిడెండ్ చెల్లించింది. సెయిల్ షేర్ ధర నేడు రూ. 82 గా ఉంది. అంటే ఈ మెటల్ పీఎస్‌యూ డివిడెండ్ ప్రతిఫలం 10.70 శాతంగా ఉంది. అంటే లాంగ్ టెర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్ ఇచ్చే ప్రతిఫలం కన్నా కూడా ఎక్కువే.

2] Power Finance Corporation Ltd or PFC: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లేదా పీఎఫ్‌సీ షేర్లు వాటి 52 వారాల గరిష్ట స్థాయి కంటే 22 శాతం తక్కువగా ట్రేడవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌సీ డివిడెండ్ ప్రతిఫలం షేర్ హోల్డర్లకు రూ. 12.25 చొప్పున లభించింది. ఈ మొత్తాన్ని నాలుగు సందర్భాల్లో ఇచ్చింది. ప్రస్తుతం పీఎఫ్‌సీ షేర్ ధర రూ. 110గా ట్రేడవుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన డివిడెండ్ రాబడి 11 శాతం కంటే ఎక్కువే ఉంది.

3] PTC India: పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) ఇండియా

పీటీసీ ఇండియా గత ఏడాది డివిడెండ్ ఇచ్చిన మరో పబ్లిక్ సెక్టార్ సంస్థ. షేరుకు రూ 7.50 చొప్పున డివిడెండ్ ఇచ్చింది. ప్రస్తుతం పీటీసీ షేర్ ధర రూ. 71.25గా ఉంది. అంటే ప్రస్తుత వార్షిక డివిడెండ్ రాబడి 10.50 శాతంగా ఉన్నట్టు లెక్క. ఇది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా వచ్చే ప్రతిఫలం కంటే చాలా ఎక్కువ.

4] Coal India Ltd: కోల్ ఇండియా లిమిటెడ్

ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా గత ఏడాది రూ. 17 చొప్పున డివిడెండ్ చెల్లించింది. అర్హులైన షేర్ హోల్డర్లకు మూడు విడుతలుగా డివిడెండ్ చెల్లించింది. ప్రస్తుతం కోల్ ఇండియా షేర్ ధర రూ. 240గా ఉంది. అంటే ప్రస్తుత వార్షిక డివిడెండ్ రాబడి 7 శాతంగా ఉంది.

5] Indian Oil Corporation Ltd or IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

మరో నవరత్న కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ షేరుకు రూ. 11.40 చొప్పున డివిడెండ్ చెల్లించింది. రెండు విడతలుగా ఈ చెల్లింపులు చేసింది. ప్రస్తుతం ఐఓసీ షేరు ధర రూ. 68గా ఉంది. అంటే వార్షిక డివిడెండ్ రాబడి 16.75 శాతంగా ఉన్నట్టు లెక్క.

అయితే ఇన్వెస్టర్లు డివిడెండ్ చెల్లింపులు చేసే కంపెనీలను పూర్తిగా అర్థ: చేసుకోవాలి. డివిడెండ్ రాబడులు ఏటా మారుతుండవచ్చు. అలాగే స్టాక్ కొనుగోలుకు డివిడెండ్ చెల్లింపు ఒక్కటే ప్రాతిపదిక కాదని నిపుణులు చెబుతున్నారు.