తెలుగు న్యూస్  /  Business  /  Rbi To Hold Special Mpc Meet On Nov 3 On Preparing Inflation Report

RBI special MPC meet: ధరలు తగ్గించడంలో ఎందుకు విఫలమయ్యాం? 3న ఆర్బీఐ నివేదిక

HT Telugu Desk HT Telugu

27 October 2022, 22:17 IST

  • RBI to hold special MPC meet: ధరలు అదుపులో ఉంచడంలో వైఫల్యంలపై ఆర్‌బీఐ నవంబరు3, 2022న ప్రత్యేక మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తోంది.

నవంబరు 3, 2022న మానిటరీ పాలసీ కమిటీ సమావేశం
నవంబరు 3, 2022న మానిటరీ పాలసీ కమిటీ సమావేశం (HT_PRINT)

నవంబరు 3, 2022న మానిటరీ పాలసీ కమిటీ సమావేశం

ముంబయి: వరుసగా మూడు త్రైమాసికాలుగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం కంటే తక్కువగా ఉంచడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విఫలమైంది. ఈ నేపథ్యంలో అందుకు గల కారణాల కూర్పుతో నివేదికను రూపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ నవంబర్ 3న ద్రవ్య విధాన కమిటీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చట్టంలోని సెక్షన్ 45జడ్ఎన్ నిబంధనల ప్రకారం... మానిటరింగ్ పాలసీ కమిటీ అదనపు సమావేశం నవంబర్ 3, 2022న షెడ్యూల్ చేశాం..’ అని సెంట్రల్ బ్యాంక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

చట్టంలోని సెక్షన్ 45జడ్ఎన్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కొనసాగించడంలో వైఫల్యంపై చర్చిస్తుంది.

ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిది నెలలు లేదా మూడు త్రైమాసికాల్లో గరిష్ట సహన పరిమితి 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది.

ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకుల తరహాలోనే వడ్డీ రేట్లను భారీగా పెంచుతూ వచ్చింది. మే నెలలో అనూహ్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించిన ఆర్బీఐ మొత్తంగా నాలుగు విడుతలుగా 190 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం మేరకు ద్రవ్యోల్భణం దిగిరాలేదు.

అయితే ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా ఒక ప్రకటన చేస్తూ సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్భణం దిగొచ్చేదాకా వడ్డీ రేట్లు పెంచాలని, ఆయా నిర్ణయాలు ఆలస్యంగా ఫలితాలను ఇస్తాయని చెప్పారు. 2024 వరకు ఓపిక పట్టాలని పరోక్షంగా తేల్చిచెప్పారు.

అయితే ఆర్‌బీఐ తన తదుపరి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను మరోసారి పెంచుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.