తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Starts Pilot Digital Currency Program: డిజిటల్ కరెన్సీని ప్రారంభించిన ఆర్బీఐ

RBI starts pilot digital currency program: డిజిటల్ కరెన్సీని ప్రారంభించిన ఆర్బీఐ

HT Telugu Desk HT Telugu

01 November 2022, 20:43 IST

  • RBI starts pilot digital currency program: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా డిజిటల్ కరెన్సీ లావాదేవీలను ప్రారంభించింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

RBI starts pilot digital currency program: డిజిటల్ కరెన్సీ దిశగా భారత్ తొలి అడుగు వేసింది. పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ బాండ్ల ట్రేడింగ్ ను డిజిటల్ కరెన్సీతో నిర్వహించింది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ ల ద్వారా ప్రభుత్వ బాండ్ల ట్రేడింగ్ ను డిజిటల్ కరెన్సీ లావాదేవీలతో జరిపింది.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

RBI starts pilot digital currency program: 275 కోట్ల రూపాయలు..

ఎంపిక చేసిన 9 బ్యాంకుల ద్వారా ఆర్బీఐ ఈ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ను నిర్వహించింది. ఆ బ్యాంకులు తొలి రోజైన మంగళవారం 275 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్ల ను ఈ కొత్త కరెన్సీ విధానం ద్వారా మంగళవారం ట్రేడ్ చేశాయని క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Clearing Corp. of India Ltd) వెల్లడించింది. ఆ 9 బ్యాంకులు డిజిటల్ కరెన్సీతో ప్రభుత్వ సెక్యూరిటీస్ కు సంబంధించి సెకండరీ మార్కెట్ లావాదేవీలు నిర్వహించాయి.

RBI starts pilot digital currency program: 9 బ్యాంకులు

2027బాండ్ లో రూ. 140 కోట్ల విలువైన 24 ట్రేడ్స్ ను, 2032 బాండ్లలో రూ. 130 కోట్ల విలువైన 23 ట్రేడ్స్ ను ఆయా బ్యాంక్ మంగళవారం ఈ డిజిటల్ కరెన్సీతో నిర్వహించాయి. పైలట్ ప్రాజెక్టుగా State Bank of India, Bank of Baroda, Union Bank of India, HDFC Bank, ICICI Bank Ltd., Kotak Mahindra Bank, Yes Bank, IDFC First Bank, HSBC Bank లకు RBI అనుమతించింది. ప్రభుత్వ రంగంలో డిజిటల్ కరెన్సీని ఇప్పటికే సింగపూర్, చైనా, బహమాస్ తదితర దేశాలు ప్రారంభించాయి.

RBI starts pilot digital currency program: త్వరలో రిటెయిలింగ్ లోనూ..

త్వరలో రిటెయిలింగ్ లో కూడా డిజిటల్ కరెన్సీ(e-rupee)ని ప్రారంభిస్తామని ఆర్బీఐ తెలిపింది. నెల రోజుల్లో రిటెయిలింగ్ లో e-rupee వినియోగం ప్రారంభిస్తామని వెల్లడించింది. ప్రైవేటు డిజిటల్ కరెన్సీలకు పోటీగా ప్రభుత్వం ఈ e-rupee ని మార్కెట్లోకి తీసుకువస్తోంది.