e-RUPI అంటే ఏమిటి? మిగతా డిజిటల్ కరెన్సీలతో పోల్చితే ఇది ఎందుకు మెరుగైంది?-what is e rupi how its different from other digital payments ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  What Is E-rupi? How Its Different From Other Digital Payments

e-RUPI అంటే ఏమిటి? మిగతా డిజిటల్ కరెన్సీలతో పోల్చితే ఇది ఎందుకు మెరుగైంది?

Manda Vikas HT Telugu
Jan 04, 2022 09:43 AM IST

e-RUPI అనేది ఒక డిజిట‌ల్ వోచ‌ర్‌. ల‌బ్ధిదారునికి ఇది ఒక ఎస్ఎంఎస్ లేదా క్యుఆర్ కోడ్ రూపంలో అందుతుంది. ఇది ప్రీ-పెయిడ్ వోచ‌ర్ కావ‌డం వ‌ల్ల వినియోగదారులు e-RUPI సౌకర్యం కలిగిన ఏ కేంద్రానికైనా వెళ్లి న‌గ‌దుగా మార్చుకోవ‌చ్చు లేదా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

e-RUPI
e-RUPI (Stock Photo)

దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగేలా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వోచర్ ఆధారిత డిజిటల్ చెల్లింపు వ్యవస్థ "e-RUPI" ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ , నేషనల్ హెల్త్ అథారిటీ అధ్వర్యంలో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారం దేశంలోని వినియోగదారులు చేపట్టే వివిధ డిజిట‌ల్ లావాదేవీల‌కు ఒక వ్యవస్థగా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

e-RUPI అంటే ఏమిటి, అదెలా ప‌ని చేస్తుంది?

e-RUPI అనేది ఒక డిజిట‌ల్ వోచ‌ర్‌. ల‌బ్ధిదారునికి ఇది ఒక ఎస్ఎంఎస్ లేదా క్యుఆర్ కోడ్ రూపంలో అందుతుంది. ఇది ప్రీ-పెయిడ్ వోచ‌ర్ కావ‌డం వ‌ల్ల వినియోగదారులు e-RUPI సౌకర్యం కలిగిన ఏ కేంద్రానికైనా వెళ్లి న‌గ‌దుగా మార్చుకోవ‌చ్చు లేదా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. 

ఎలాంటి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, డిజిట‌ల్ పేమెంట్స్ యాప్ లేదా ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అవ‌స‌రం లేకుండానే వినియోగ‌దారులు ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్ చూపించి ఈ వోచర్‌ను రీడీమ్ చేసుకోవచ్చు లేదా న‌గ‌దుగా మార్చుకోవ‌చ్చు. ఇలా నగదు రహిత,  భౌతిక ఇంటర్‌ఫేస్ లేని ఒక డిజిటల్ చెల్లింపుల మాధ్యమంగా ఇది పనిచేస్తుంది.

అయితే ఈ-రుపీని భార‌త రిజ‌ర్వు బ్యాంకు జారీ చేసే డిజిట‌ల్ క‌రెన్సీగా మాత్రం భావించ‌కూడ‌దు. ఈ-రుపీ అనేది నగదు లావాదేవీలకు సంబంధించి లబ్దిదారుడి పేరు మీద‌ జారీ చేసే ఒక డిజిటల్ వోచర్ మాత్రమే, ఇది ఒక గిఫ్ట్ వోచర్/ కార్డులా పనిచేస్తుంది.

e-RUPI ఏ విధంగా వినియోగ‌దారునికి ప్ర‌యోజ‌న‌క‌రం?

e-RUPI వినియోగించే వ్య‌క్తికి బ్యాంకు ఖాతా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఇత‌ర డిజిట‌ల్ చెల్లింపు విధానాల‌తో పోల్చితే ఈ-రుపీ విశిష్ట ల‌క్ష‌ణం ఇదే. దీంతో ల‌బ్ధిదారుడి వ్యక్తిగత సమాచారం అవతలివారికి తెలియ‌చేయాల్సిన అవ‌స‌రం ఉండదు. ఇది కాంటాక్ట్ ర‌హితంగా రెండంచెల్లో రిడెంప్ష‌న్ (చెల్లింపు) ప్ర‌క్రియ పూర్తి చేసే విధానం.

బేసిక్ ఫోన్లలో కూడా ప‌ని చేయ‌డం ఈ-రూపీ అందించే మ‌రో ప్ర‌యోజ‌నం. అంటే స్మార్ట్ ఫోన్లు లేని వారు, ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా దీన్ని వినియోగించుకోవ‌చ్చు.

-రూపీ స్పాన్స‌ర్ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలేమిటి?

ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ విధానాన్ని (Direct Benefit Transfer) ప‌టిష్ఠం చేయ‌డంలో ఈ-రూపీ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆ ప్ర‌క్రియను మ‌రింత పార‌ద‌ర్శ‌కం చేస్తుంది. ఎలాంటి ఫిజిక‌ల్ వోచ‌ర్లు జారీ చేయాల్సిన అవ‌స‌రం లేదు కాబట్టి ఇది వ్య‌యాన్ని పొదుపు చేసే సాధ‌నమని కూడా చెప్ప‌వ‌చ్చు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం