తెలుగు న్యూస్  /  Business  /  No Google Hangouts From November 2: Steps To Download Conversation History

No Google Hangouts from November 2: గూగుల్ హ్యాంగ్ ఔట్స్ కు గుడ్ బై

HT Telugu Desk HT Telugu

02 November 2022, 19:09 IST

  • No Google Hangouts from November 2: నెటిజన్లకు గూగుల్ హ్యాంగ్ ఔట్స్(Google Hangouts) బుధవారం నుంచి అందుబాటులో ఉండదు. అలాగే, యూజర్లు  ఈ గూగుల్ హ్యాంగ్ ఔట్స్ నుంచి తమ డేటాను, చాట్ హిస్టరీని ఈ డిసెంబర్ 31 లోగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి హ్యాంగ్ ఔట్స్(Google Hangouts) డేటా అంతా డిలీట్ అవుతుంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

No Google Hangouts from November 2: హ్యాంగ్ ఔట్స్ ప్లాట్ ఫామ్(Hangouts platform) ను మూసేస్తున్నట్లు గూగుల్ కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. ‘గూగుల్ చాట్’(Google Chat) మాత్రమే తమ డీ ఫాల్ట్ చాట్ అప్లికేషన్ అని స్పష్టం చేసింది. Hangouts platform ను వాడే యూజర్లు Google Chat కు నవంబర్ 1 లోగా మారాలని సూచించింది. నవంబర్ 1 తరువాత Hangouts యూజర్లు ఆటోమేటిక్ గా Google Chat కు డైవర్ట్ చేయబడ్తారని తెలిపింది.

No Google Hangouts from November 2: జనవరి 1, 2023 లోపే..

Google Hangouts నుంచి యూజర్లు తమ డేటాను, చాట్ హిస్టరీని ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు మాత్రమే డౌన్ లోడ్ చేసుకోగలరు. జనవరి 1, 2023న Google Hangouts నుంచి డేటా మొత్తం డిలీట్ అవుతుంది.

No Google Hangouts from November 2: Google Hangouts నుంచి డేటా డౌన్ లోడ్ ఎలా?

Google Hangouts నుంచి చాట్ హిస్టరీకి సంబంధించిన డేటాను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

  • మొదట Google Takeout కు వెళ్లి, సైన్ ఇన్ అవ్వాలి.
  • అక్కడ ఉన్న అప్లికేషన్లలో Hangouts ను సెలక్ట్ చేసుకుని, మిగతా వాటిని డీ సెలెక్ట్ చేయాలి.
  • ‘నెక్స్ట్ స్టెప్’ కు వెళ్లి డెలివరీ మెథడ్ లో వన్ టైమ్ డౌన్ లోడ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఫైల్ టైప్ ను సెలెక్ట్ చేసుకుని ‘ఎక్స్ పోర్ట్’పై క్లిక్ చేయాలి.
  • మీ డేటా కాపీ ఒకటి క్రియేట్ అయినట్లుగా మీకు ఒక మెసేజ్ వస్తుంది.
  • ఆ ఫైల్ ను మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • For more details, click on this link.

టాపిక్