Hyundai Grand i10 Nios vs Maruti Swift : న్యూ గ్రాండ్ ఐ10 నియోస్ వర్సెస్ మారుతీ స్విఫ్ట్.. బెస్ట్ ఏది?
22 January 2023, 8:24 IST
- New Hyundai Grand i10 Nios vs Maruti suzuku Swift : హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఇది మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కు గట్టిపోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింట్లో ది బెస్ట్ ఏదనేది ఇక్కడ తెలుసుకుందాము..
గ్రాండ్ ఐ10 నియోస్ వర్సెస్ మారుతీ స్విఫ్ట్.. ది బెస్ట్ ఏది?
New Hyundai Grand i10 Nios vs Maruti suzuku Swift : ఇండియా ఆటో మార్కెట్లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తోందన్న మాట నిజమే. అలా అని చిన్న కార్ల సెగ్మెంట్ ఇక మాయమైపోతుందని అనుకుంటే పొరపాటే! ముఖ్యంగా చిన్న కార్లలో హ్యాచ్‌బ్యాక్ మోడల్స్‌ను ఇప్పటికీ చాలా మంది భారతీయులు ప్రిఫర్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాయి ఆటో సంస్థలు. కొన్ని సంస్థలు.. ఇప్పటికే ఉన్న మోడల్స్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ విధంగా లాంచ్ అయ్యిందే.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. సాధారణంగానే గ్రాండ్ ఐ10 నియోస్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కూడా దూసుకెళుతుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. చిన్న కార్ల సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న మారుతీకి ఈ విధంగా గట్టిపోటీనిస్తోంది హ్యుందాయ్. ఈ నేపథ్యంలో.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను మారుతీ సుజుకీ స్విఫ్ట్‌తో పోల్చి.. ఈ రెండింట్లో ది బెస్ట్ ఏదనేది ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వర్సెస్ మారుతీ సుజుకీ స్విఫ్ట్- స్పెసిఫికేషన్స్..
న్యూ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పొడవు 3,815ఎంఎం, వెడల్పు 1,680ఎంఎం, ఎత్తు 1,520ఎంఎం ఉంటుంది. ఈ మోడల్ వీల్‌బేస్ 2,450ఎంఎం. 15 ఇంచ్ అలాయ్ వీల్స్ కొత్తగా వస్తోంది.
Hyundai Grand i10 Nios 2023 : గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కన్నా మారుతీ సుజుకీ స్విఫ్ట్ కాస్త పెద్దది! నియోస్ కన్నా దీని పొడవు 35ఎంఎం, వెడల్పు 55ఎంఎం, ఎత్తు 10ఎంఎం ఎక్కువగా ఉంటుంది. వీల్‌బేస్ మాత్రం ఒకే విధంగా ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను మారుతీ సుజుకీ స్విఫ్ట్- ఫీచర్స్..
Maruti Suzuki Swift features : మారుతీ సుజుకీ స్విఫ్ట్ కన్నా న్యూ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో ఫీచర్స్ అధికంగా ఉన్నాయి. గ్రాండ్ ఐ10 నియోస్‌లో 30కిపైగా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, థెఫ్ట్ అలారం వంట ఫీచర్స్ ఇందులో భాగం.
Maruti Brezza vs Maruti Fronx : మారుతీ బ్రెజా వర్సెస్ మారుతీ ఫ్రాంక్స్.. ఏది కొంటే బెటర్? అన్న విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ క్యాబిన్లో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, టైప్- సీ ఛార్జింగ్ పోర్ట్, వయర్లెస్ ఛార్జింగ్, రేర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటివి లభిస్తున్నాయి. వీటితో పాటు గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చిన మరిన్ని ఫీచర్స్.. మారుతీ స్విఫ్ట్‌లో లేవు.
న్యూ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను మారుతీ సుజుకీ స్విఫ్ట్- ఇంజిన్..
New Hyundai Grand i10 Nios features : ఈ రెండు మోడల్స్‌లోను 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. రెండింట్లోనూ 5 స్పీడ్ మేన్యువల్, ఆటోమెటిక్ గేర్‌బాక్స్ లభిస్తోంది. కానీ పవర్ ఔట్పుట్ పరంగా చూసుకుంటే.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కన్నా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కు మార్కులు ఎక్కువ పడతాయి. గ్రాండ్ ఐ10 నియోస్ 83 పీఎస్ పవర్‌ను, 114 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మరోవైపు మారుతీ స్విఫ్ట్ 90 పీఎస్ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను మారుతీ సుజుకీ స్విఫ్ట్- ధరలు..
New Hyundai Grand i10 Nios price : న్యూ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మేన్యువల్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 5.68లక్షలు- రూ. 7.93లక్షల మధ్యలో ఉంటుంది. ఆటోమెటిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.23లక్షలు- రూ. 8.46లక్షల మధ్యలో ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.56లక్షలు- రూ. 8.11లక్షల మధ్యలో ఉంటుంది.
Maruti Suzuki Swift on road price in Hyderabad : ఇక మారుతీ సుజుకీ స్విఫ్ట్ మేన్యువల్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 5.91లక్షలు- రూ. 8.21లక్షల మధ్యలో ఉంది. ఆటోమెటిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.32లక్షలు- 8.71లక్షల మధ్యలో ఉంది. ఇక సీఎన్జీ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.77లక్షలు- రూ. 8.45లక్షల మధ్యలో ఉంటుంది.