తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nclat Upholds Fine On Google: ‘‘1338 కోట్ల ఫైన్ ను గూగుల్ కట్టాల్సిందే’’

NCLAT upholds fine on Google: ‘‘1338 కోట్ల ఫైన్ ను గూగుల్ కట్టాల్సిందే’’

HT Telugu Desk HT Telugu

29 March 2023, 20:03 IST

  • NCLAT upholds fine on Google: అనైతిక, యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్ కు పాల్పడిన నేరానికి సీసీఐ (Competition Commission of India CCI) విధించిన రూ. 1338 కోట్ల జరిమానాను గూగుల్ (Google) కట్టి తీరాల్సిందేనని NCLAT (National Company Law Appellate Tribunal) స్పష్టం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

NCLAT upholds fine on Google: అనైతికంగా, అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా పోటీని అడ్డుకునే చర్యలు చేపట్టిన నేరానికి గతంలో గూగుల్ కు సీసీఐ (Competition Commission of India CCI) రూ. 1338 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుపై గూగుల్ (Google) NCLAT (National Company Law Appellate Tribunal) ను ఆశ్రయించింది. దాంతో, ఈ కేసును విచారించిన NCLAT బుధవారం తీర్పు వెలువరించింది.

NCLAT upholds fine on Google: ఆ జరిమానా కట్టాల్సిందే

అక్రమ, అనైతిక పోటీ నిరోధక చర్యలకు పాల్పడడం రుజువైనందున గూగుల్ (Google) ఆ జరిమానా చెల్లించక తప్పదని NCLAT స్పష్టం చేసింది. 30 రోజుల్లోగా ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆండ్రాయిడ్ (android) మొబైల్ డివైజెస్ లో తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని యూజర్ల స్వేచ్ఛను, హక్కులను గూగుల్ (Google) నియంత్రించాలనుకుందని NCLAT నిర్ధారించింది. అయితే, ఈ తీర్పులో సీసీఐ (CCI) ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని NCLAT తోసిపుచ్చింది. థర్డ్ పార్టీ యాప్ (third-party app) లకు గూగుల్ ప్లే స్టోర్ లో కచ్చితంగా స్థానం కల్పించాలన్న సీసీఐ ఆదేశాలను NCLAT తొలగించింది. ఆండ్రాయిడ్ (android) డివైజెస్ లో ముందే ఇన్ స్టాల్ అయి ఉన్న యాప్స్ ను (pre-installed apps) తొలగించే విషయంలో యూజర్లకు స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. అలాగే, మొదట స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ డివైజ్ ను సెటప్ చేసే సమయంలో, యూజర్ కు తనకు నచ్చిన సెర్ఛ్ ఇంజిన్ ను డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ (default search engine) గా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. NCLAT ఇచ్చిన తీర్పును అధ్యయనం చేస్తున్నామని, లీగల్ ఎక్స్ పర్ట్స్ టీం తో చర్చించిన తరువాత తదుపరి తీసుకోబోయే చర్యల విషయం వెల్లడిస్తామని గూగుల్ (Google) తెలిపింది.

టాపిక్