CCI slaps 1,338 crore rupees fine on Google: గూగుల్ కు రూ. 1338 కోట్ల జరిమానా-cci slaps rs 1 338 crore fine on google for anti competitive practices ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cci Slaps 1,338 Crore Rupees Fine On Google: గూగుల్ కు రూ. 1338 కోట్ల జరిమానా

CCI slaps 1,338 crore rupees fine on Google: గూగుల్ కు రూ. 1338 కోట్ల జరిమానా

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 09:25 PM IST

CCI slaps ₹1,338 crore fine on Google: అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘గూగుల్’ కు భారతీయ నియంత్రణ సంస్థ Competition Commission of India (CCI) షాక్ ఇచ్చింది. పోటీతత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సుమారు రూ. 1338 కోట్ల జరిమానా విధించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ యాజమాన్య కంపెపీ ఆల్ఫాబెట్ కు CCI షాక్ ఇచ్చింది. anti-competitive practices కు పాల్పడుతున్న నేరంపై సుమారు రూ. 1338 కోట్ల జరిమానా విధించింది.

CCI slaps 1,338 crore fine on Google: ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి..

ఆండ్రాయిడ్ మొబైల్స్ కు సంబంధించి గూగుల్ అనైతికంగా, పోటీ తత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని సీసీఐ ఆరోపించింది. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లలో Original Equipment Manufacturers (OEMs) ఇన్ స్టాల్ చేస్తారు.

CCI slaps 1,338 crore fine on Google: Google Mobile Suite (GMS) తప్పని సరా?

ఆండ్రాయిడ్ ఓఎస్ పై మొబైల్ ఫోన్ తయారీ దారులు Mobile Application Distribution Agreement (MADA) కింద మొబైల్ ఫొన్లలో Google Mobile Suite (GMS) ను కచ్చితంగా ముందే ఇన్ స్టాల్ చేయాలన్న గూగుల్ ఒత్తిడిని CCI తప్పుబట్టింది. దానికి అన్ ఇన్ స్టాల్ చేసే అవకాశ లేకుండా చేయడం కూడా పోటీ తత్వ వ్యతిరేక చర్యేనని స్పష్టం చేసింది.

CCI slaps 1,338 crore fine on Google: తీరు మార్చుకోవాలి..

జరిమానాతో పాటు పలు హెచ్చరికలను కూడా గూగుల్ కు CCI జారీ చేసింది. నిర్దేశిత సమయంలోగా ఈ అక్రమ, అనైతిక తీరును మార్చుకోవాలని హెచ్చరించింది. ఈ అనైతిక, అక్రమ వ్యాపార శైలికి దూరంగా ఉండకపోతే, మరిన్ని చర్యలుంటాయని స్పష్టం చేసింది.

IPL_Entry_Point