తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio 5g On Xiaomi Phones: షావోమీ 5జీ ఫోన్‍లకు జియో 5జీ సపోర్ట్.. మీ మొబైల్‍కు అప్‍డేట్ వచ్చిందేమో చెక్ చేసుకోండి

Jio 5G on Xiaomi Phones: షావోమీ 5జీ ఫోన్‍లకు జియో 5జీ సపోర్ట్.. మీ మొబైల్‍కు అప్‍డేట్ వచ్చిందేమో చెక్ చేసుకోండి

27 December 2022, 16:00 IST

    • Jio 5G on Xiaomi Phones: షావోమీ, రెడ్‍మీ 5జీ ఫోన్‍లన్నీ జియో 5జీ నెట్‍వర్క్‌కు సపోర్ట్ చేయనున్నాయి. ఇందుకు సంబంధించిన అప్‍డేట్ రోల్అవుట్‍ను షావోమీ మొదలుపెట్టింది. పూర్తి వివరాలు ఇవే.
Jio 5G on Xiaomi Phones: షావోమీ 5జీ ఫోన్‍లకు జియో 5జీ సపోర్ట్ (HT Photo)
Jio 5G on Xiaomi Phones: షావోమీ 5జీ ఫోన్‍లకు జియో 5జీ సపోర్ట్ (HT Photo)

Jio 5G on Xiaomi Phones: షావోమీ 5జీ ఫోన్‍లకు జియో 5జీ సపోర్ట్ (HT Photo)

Jio 5G on Xiaomi Phones: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‍ షావోమీతో టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో షావోమీ, రెడ్‍మీ 5జీ ఫోన్లన్నీ జియో ట్రూ 5జీ నెట్‍వర్క్ (Jio True 5G Network)కు ఇక సపోర్ట్ చేయనున్నాయి. 5జీ ఫోన్‍లలో జియో 5జీని ఎనేబుల్ చేసే అప్‍డేట్‍ను విడుదల చేస్తోంది షావోమీ. దీంతో జియో 5జీ అందుబాటులో ఉన్న నగరాల్లోని ఆ బ్రాండ్‍కు చెందిన 5జీ ఫోన్‍ల యూజర్లు కొత్తతరం నెట్‍వర్క్‌ను వాడుకోవచ్చు. జియో 5జీ నెట్‍వర్క్‌కు సపోర్ట్ చేసే షావోమీ, రెడ్‍మీ మోడళ్లు ఏవో కూడా లిస్ట్ వెల్లడించింది.

జియో 5జీని ఎనేబుల్ చేసే అప్‍డేట్‍ క్రమంగా షావోమీ, రెడ్‍మీ 5జీ ఫోన్‍లకు వస్తుంది. మీ ప్రాంతంలో జియో 5జీ నెట్‍వర్క్ లాంచ్ అయి ఉంటే.. ఫోన్‍ను అప్‍డేట్ చేశాక 5జీని వినియోగించుకోవచ్చు. ఫోన్‍లోని సెట్టింగ్స్ (Settings) యాప్‍లోని మొబైల్ నెట్‍వర్క్ (Mobile Network) ఆప్షన్‍లో ప్రిఫర్డ్ నెట్‍వర్క్ టైప్‍ (Prefered Network Type)లోకి వెళ్లి 5జీ (5G) నెట్‍వర్క్ ఆప్షన్‍ను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు, 5జీ సర్వీస్ మీ ఏరియాలో ఉంటే 5జీ సింబల్ చూపిస్తుంది.

జియో ట్రు 5జీకి సపోర్ట్ చేసే షావోమీ, రెడ్‍మీ స్మార్ట్ ఫోన్లు

  • షావోమీ ఎంఐ 11 అల్ట్రా 5జీ
  • షావోమీ 12 ప్రో 5జీ
  • షావోమీ 11టీ ప్రో 5జీ
  • రెడ్‍మీ నోట్ 11 ప్రో+ 5జీ
  • షావోమీ 11 లైట్ ఎన్‍ఈ 5జీ
  • రెడ్‍మీ నోట్ 11టీ 5జీ
  • రెడ్‍మీ 11 ప్రైమ్ 5జీ
  • షావోమీ రెడ్‍మీ నోట్ 11టీ 5జీ
  • షావోమీ ఎంఐ 11ఎక్స్ 5జీ
  • షావోమీ ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ
  • రెడ్‍మీ కే50ఐ 5జీ
  • షావోమీ 11ఐ 5జీ
  • షావోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ

ఇప్పటి వరకు ఈ నగరాల్లో జియో 5జీ

Jio 5G Cities: దేశంలోని సుమారు 15 నగరాల్లో రిలయన్స్ జియో 5జీ నెట్‍వర్క్ అందుబాటులో ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, తిరుమల, గుంటూరు, విజయవాడ నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను లాంచ్ చేసింది జియో. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, పూణె, నత్‍ద్వారా, కొచ్చి సిటీల్లో జియో 5జీ అందుబాటులో ఉంది. అలాగే గుజరాత్‍లోని 33 జిల్లాల కేంద్రాల్లోనూ ఈ సంస్థ 5జీ సర్వీసులు ఉన్నాయి. 2023 చివరి కల్లా దేశమంతా 5జీ నెట్‍వర్క్ ను విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.