తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo Z7 5g: ఐకూ నుంచి త్వరలో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్: లాంచ్ డేట్ సహా మరిన్ని వివరాలు వెల్లడి

iQoo Z7 5G: ఐకూ నుంచి త్వరలో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్: లాంచ్ డేట్ సహా మరిన్ని వివరాలు వెల్లడి

07 March 2023, 12:17 IST

    • iQoo Z7 5G: ఐకూ జెడ్7 5జీకి సంబంధించిన మరో టీజర్‌ను ఆ సంస్థ వెల్లడించింది. అలాగే ఈ ఫోన్ లాంచ్ డేట్ సహా మరిన్ని వివరాలు బయటికి వచ్చాయి.
iQoo Z7 5G: ఐకూ నుంచి త్వరలో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ (Photo: iQoo)
iQoo Z7 5G: ఐకూ నుంచి త్వరలో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ (Photo: iQoo)

iQoo Z7 5G: ఐకూ నుంచి త్వరలో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ (Photo: iQoo)

iQoo Z7 5G: వివో సబ్‍బ్రాండ్ ఐకూ (iQoo) నుంచి ఈనెలలోనే బడ్జెట్ రేంజ్‍లో 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. ఐకూ జెడ్7 5జీ(iQoo Z7 5G)ని అతిత్వరలో లాంచ్ చేయనున్నట్టు ఆ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈనెల 21వ తేదీన ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. ఓ యాడ్ ద్వారా ఐకూ అనుకోకుండా ఈ విడుదల తేదీని రివీల్ చేసింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17వేలలోపు ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా ఈ మొబైల్‍కు సంబంధించి ఓ టీజర్‌ను ట్విట్టర్‌లో ఐకూ పోస్ట్ చేసింది. దీని ద్వారా ఫ్రంట్ డిజైన్‍ను టీజ్ చేసింది. అలాగే ఐకూ జెడ్7 5జీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

iQoo Z7 5G: డిజైన్ ఇలా..

టీజర్ ద్వారా ఐకూ జెడ్7 5జీ ఫ్రంట్ డిజైన్‍ను ఐకూ రివీల్ చేసింది. ఫ్రంట్ కెమెరా కోసం ఈ మొబైల్ డిస్‍ప్లే సెంటర్ టాప్‍లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. కుడిపక్క పవర్ బటన్, వాల్యూమ్ అప్, డౌన్ బటన్స్ ఉంటాయి. అయితే లీక్‍ల ద్వారా ఈ ఫోన్‍కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి వచ్చాయి.

iQoo Z7 5G: 120 హెర్ట్జ్ (Hz) రిఫ్రెష్ రేట్ ఉండే 6.5 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేతో ఐకూ జెడ్7 5జీ వస్తుందని తెలుస్తోంది. మీడియాటెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుందని సమాచారం. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‍టచ్ఓఎస్ 13తో రానుంది.

iQoo Z7 5G: ఐకూ జెడ్7 5జీ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 5,000mAh బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. ఐకూ జెడ్7 5జీ ప్రారంభ ధర రూ.17వేలలోపు ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. జెడ్7 సిరీస్‍లో ఐకూ జెడ్7 ప్రో 5జీ కూడా తర్వాత రానుంది.

iQoo Z7 5G: గతేడాది స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఐకూ జెడ్6 5జీ లాంచ్ అయింది. ఈ సిరీస్‍లో జెడ్6 ప్రో 5జీ, జెడ్6 లైట్ 5జీ, జెడ్6 44డబ్ల్యూ మొబైళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఐకూ జెడ్6 5జీ ప్రారంభ ధర రూ.14,499గా ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍ను ఈ మొబైల్ కలిగి ఉంది. 6.58 ఇంచుల ఎల్‍సీడీ డిస్‍ప్లేను కలిగి ఉంది.