iQoo: 64MP OIS కెమెరా, అమోలెడ్ డిస్‍ప్లేతో iQoo Neo 7 5G లాంచ్: 10 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అయ్యేలా..-iqoo neo 7 5g price in india launched with mediatek dimensity 8200 120w fast charging android 13 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo: 64mp Ois కెమెరా, అమోలెడ్ డిస్‍ప్లేతో Iqoo Neo 7 5g లాంచ్: 10 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అయ్యేలా..

iQoo: 64MP OIS కెమెరా, అమోలెడ్ డిస్‍ప్లేతో iQoo Neo 7 5G లాంచ్: 10 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అయ్యేలా..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 16, 2023 02:12 PM IST

iQoo Neo 7 5G: ఐకూ నియో 7 5జీ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. 120W ఫాస్ట్ చార్జింగ్, హెవీ గేమింగ్‍కు సూటయ్యే ప్రాసెసర్, అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉంది. స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే రూ.30వేలలోపు ఆల్‍రౌండ్ ఫోన్‍గా కనిపిస్తోంది.

iQoo: 120W ఫాస్ట్ చార్జింగ్‍, అమోలెడ్ డిస్‍ప్లేతో iQoo Neo 7 లాంచ్
iQoo: 120W ఫాస్ట్ చార్జింగ్‍, అమోలెడ్ డిస్‍ప్లేతో iQoo Neo 7 లాంచ్

iQoo Neo 7 5G: ఐకూ నియో 7 5జీ ఇండియాలో లాంచ్ అయింది. ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 8200 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఎంతో పాపులర్ అయిన నియో 6 5జీ మోడల్‍కు సక్సెసర్‌గా, చాలా అప్‍గ్రేడ్‍లతో ఐకూ నియో 7 5జీ నేడు (ఫిబ్రవరి 16) భారత్‍లో విడుదలైంది. ఈ ఫోన్ వెనుక OIS సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీంతో 10 నిమిషాల్లోనే ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని ఐకూ పేర్కొంది. గేమింగ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. అన్ని విభాగాల్లో స్పెసిఫికేషన్లపరంగా చూస్తే రూ.30వేలలోపు ఆల్‍రౌండ్ గేమింగ్ మొబైల్‍గా ఇది కనిపిస్తోంది. ఐకూ నియో 7 5జీ ధర, ఆఫర్లు పూర్తి స్పెసిఫికేషన్లు ఇవే.

iQoo Neo 7 5G: ప్రాసెసర్, ఓఎస్

ఐకూ నియో 7 5జీ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 8200 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాససెర్‌తో ఇండియాలో లాంచ్ అయిన తొలి మొబైల్ ఇదే. యూఎఫ్‍ఎస్ 3.1 స్టోరేజ్‍తో ఈ ఐకూ నయా ఫోన్ వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‍టచ్ ఓఎస్ 13తో అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ సేపు గేమ్స్ ఆడినా హీట్ కంట్రోల్ అయ్యేందుకు గ్రాఫైట్ 3డీ కూలింగ్ సిస్టమ్ ఈ మొబైల్‍లో ఉంటుంది. గేమింగ్ కోసం మోషన్ కంట్రోల్ ఫీచర్లు కూడా ఉంటాయి.

iQoo Neo 7 5G: డిస్‍ప్లే

6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో ఐకూ నియో 7 5జీ వస్తోంది. హెచ్‍డీఆర్ 10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 పీక్ బ్రైట్‍నెస్ ఉంటాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్‍కు ఉన్నాయి.

iQoo Neo 7 5G: కెమెరాలు

ఐకూ నియో 7 5జీ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేజేషన్ (OIS)కు సపోర్ట్ చేస్తుంది. ఇక 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ మిగిలిన రెండు కెమెరాలుగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది.

iQoo Neo 7 5G: బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

ఐకూ నియో 7 5జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 120W ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాల్లోనే 50 ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని ఐకూ పేర్కొంది. మొత్తంగా ఈ మొబైల్ 195 గ్రాముల బరువు ఉంటుంది.

ఐకూ నియో 7 5జీ ధర, సేల్, ఆఫర్లు

iQoo Neo 7 5G Price in India: ఐకూ నియో 7 5జీ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది.

8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: ధర రూ.29,999

12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: ధర రూ.33,999

ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon)తో పాటు ఐకూ వెబ్‍సైట్‍లో ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఫ్రోస్ట్ బ్లూ, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.

iQoo Neo 7 5G Offer: ఎస్‍బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ నియో 7 5జీ ఫోన్‍ను కొంటే రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం