తెలుగు న్యూస్  /  Business  /  Huge Demand For Ford Bronco Suv, Carmaker Ready To Pay Buyers To Opt Other Vehicles

Ford Bronco SUV : తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!

22 January 2023, 7:15 IST

    • Ford Bronco SUV : కార్ల వెయిటింగ్​ పీరియడ్​లు రోజురోజుకు పెరిగిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాము. కానీ.. ఓ ఎస్​యూవీకి వస్తున్న భారీ డిమాండ్​ను చూసి సంస్థ చేతులెత్తేసి, మరో మోడల్​ కొనుగోలు చేయాలని కస్టమర్లకు డబ్బులిస్తున్న సంస్థను చూడటం చాలా అరుదు. ఇప్పుడు ఇదే జరిగింది..!
తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!
తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!

తమ కార్లు కొనాలని కస్టమర్లకే డబ్బులు ఇస్తున్న సంస్థ..!

Ford Bronco SUV : కొవిడ్​ సంక్షోభం కారణంగా.. వాహనాల డెలివరీలు చాలా ఆలస్యమవుతున్నాయి. కొన్ని కొన్ని మోడల్స్​కు నెలల తరబడి వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. ఇండియాలోనే కాకుండా.. అంతర్జాతీయంగానూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. ఓ ఎస్​యూవీకి లభిస్తున్న భారీ డిమాండ్​ను చూసి ఓ ఆటో సంస్థ చేతులెత్తేసింది. వేరే మోడల్​ కొనుక్కోవాలని.. కస్టమర్లకు రివర్స్​లో డబ్బులిస్తోంది! అవును.. మీరు విన్నది నిజమే. ఆటో సంస్థ.. కస్టమర్లకు డబ్బును ఆఫర్​ చేస్తోంది. ఆ సంస్థ పేరు ఫోర్డ్​. అత్యంత డిమాండ్​, సుదీర్ఘ వెయిటింగ్​ పీరియడ్​ ఉన్న ఆ వెహికిల్ పేరు​.. “ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ”.

భారీ డిమాండ్​.. డెలివరీ డీలా..!

2020లో ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించింది కరోనా వైరస్​. దీని కారణంగా సప్లై చెయిన్​ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. అంతర్జాతీయంగా ఆటో పరిశ్రమపై దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్​లో 2021లో.. బ్రోంకో ఎస్​యూవీని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటో సంస్థ ఫోర్డ్​. ప్రొడక్షన్​ను వెంటనే ప్రారంభించి.. వాహనాలను డెలివరీ చేయగలమన్న నమ్మకంతో బుకింగ్స్​ను సైతం అప్పుడే మొదలుపెట్టింది. కానీ సీన్​ రివర్స్​ అయ్యింది!

Ford Bronco SUV waiting period : 2021లో ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీని లాంచ్​ చేయగా.. 2022 వరకు దీని ప్రొడక్షన్​ ప్రారంభం అవ్వలేదు. సప్లై చెయిన్​ వ్యవస్థ దారుణంగా దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా.. అటు కస్టమర్ల నుంచి బుకింగ్స్​ విపరీతంగా పెరిగిపోయాయి. ఇటు ప్రొడక్షన్​ ఆలస్యమైపోయింది. అధికారక లెక్కలను సంస్థ వెల్లడించలేదు కానీ.. అమెరికాలో ఈ ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీకి 2లక్షలకుపైగా బుకింగ్స్​ వచ్చినట్టు సమాచారం. కొందరికి వాహనాలు అందినా.. చాలా మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ ఎస్​యూవీకి నెలల తరబడి వెయిటింగ్​ పీరియడ్​ ఉంది.

వేరే కారు కొంటే.. కస్టమర్లకు రూ. 2లక్షలు!

Ford Bronco SUV price in India : ఈ పరిస్థితులతో ఫోర్డ్​ సంస్థ చేతులెత్తేసింది. బ్రోంకో ఎస్​యూవీని డెలివరీ చేయలేమని కస్టమర్లకు చెప్పేసింది. వేరే వాహనాలను కొనుగోలు చేస్తే డబ్బులిస్తామని స్పష్టం చేసింది. రిపోర్టుల ప్రకారం.. ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ బుకింగ్స్​ రద్దు చేసుకుని, తమ సంస్థకు చెందిన ఇతర మోడల్స్​ను కొనుగోలు చేసే వారికి 2,500 డాలర్లు ఇస్తామని చెబుతోంది. ఇండియా కరెన్సీలో ఆ విలువ రూ. 2,02,400! మేవరిక్​, ముస్తాంగ్​, ఎఫ్​-150 ట్రెమర్​ వంటి మోడల్స్​పై ఈ ఆఫర్​ ఇస్తోంది.

Ford Bronco SUV latest news : ఇక ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ విషయానికొస్తే.. 2021లో లాంచ్​ అయిన ఈ మోడల్​లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 2 డోర్​ వేరియంట్​. ఇంకోటి 4 డోర్​ 4X4 వేరియంట్​. అమెరికా మార్కెట్​లో జీప్​ వ్రాంగ్లర్​కు ఈ 4X4 ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ గట్టి పోటీనిస్తోంది. ఫోర్డ్​ బ్రోంకో ఎస్​యూవీ హై ఎండ్​ మోడల్​లో.. క్రూయిజ్​ కంట్రోల్​, 10 స్పీకర్​ బీ అండ్​ ఓ సౌండ్​ సిస్టెమ్​, ఇంటిగ్రేటెడ్​ నేవిగేషన్​ అండ్​ బాడీ కలర్డ్​ హార్డ్​టాపస్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. కస్టమైజ్​ చేసుకునే ఆప్షన్​ కూడా ఇచ్చింది ఫోర్డ్​.