Maruti Suzuki cars waiting period : మారుతీ సుజుకీ కార్లు కొనాలంటే.. ‘వెయిట్’ చేయాల్సిందే!
Maruti Suzuki cars waiting period : మారుతీ సుజుకీ కారు కొనాలని భావిస్తున్నారా? కార్ల వెయిటింగ్ పీరియడ్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Maruti Suzuki Ertiga waiting period : కారు కొనాలని భావిస్తున్నారా? అయితే 'వెయిటింగ్ పీరియడ్' గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆర్డర్ బుక్‌లు పెరిగిపోతున్నప్పటికీ.. చాలా సంస్థలు సరైన సమయానికి డెలివరీ చేయలేకపోతున్నాయి. ఫలితంగా పలు మోడల్స్‌కి వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా మారుతీ సుజుకీలోని కొన్ని మోడల్స్‌కు అత్యధికంగా 9 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తుండటం గమనార్హం.
7 సీటర్ ఎర్టిగాపై అత్యధికంగా 9నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఆల్టో, ఇగ్నిస్ వంటి వాహనాలు నెలలోపే డెలివరీ అవుతున్నాయి. అంటే.. ఇప్పటికప్పుడు మీకు ఆల్టో, ఇగ్నిస్ బండ్లు దొరుకుతాయి. కానీ ఇప్పుడు మీరు ఎర్టిగాని ఆర్డర్ ఇస్తే.. 2023 ఆగస్టు వరకు మీకు అది డెలివరీ అవ్వకపోవచ్చు.
Maruti Suzuki Grand Vitara waiting period : ఇక బ్రేజా, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, బలెనో వంటి మోడల్స్‌కు కనీసం 3నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. టాప్ ఎండ్ మోడల్స్ డెలివరీ అయినా.. మిడ్ రేంజ్‌వి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు.
ఇక మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కి 2.5 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. అదే సియాజ్ కోసం 1.5నెలల పాటు నిరీక్షించాల్సిందే. వాగన్ ఆర్, ఎస్-ప్రెస్సో, సెలేరియో, డిజైర్ వంటి వాహనాల డెలివరీ కూడా 1 నెల తర్వాతే ఉంటుంది.
ఈ వెయిటింగ్ పీరియడ్ కూడా.. మోడల్, షోరూం, నగరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
ఇతర సంస్థల మోడల్స్ కూడా..!
మారుతీ సుజుకీ ఒక్కటే కాదు.. ఇతర సంస్థలది కూడా ఇదే పరిస్థితి.
Kia Sonet waiting period : హైదరాబాద్‌లో బ్రేజా వెయిటింగ్ పీరియడ్ 1.5 నెలలుగా ఉండగా.. కియా సోనెట్‌కు 3 నెలల సమయం పడుతోంది. ఇక టాటా నెక్సాన్‌కు 3 నెలలు, హ్యుందాయ్ వెన్యూ/ వెన్యూ ఎన్-లైన్‌కు 2.5 నుంచి 3 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. రెనల్ట్ ఖైగర్కు 1- 1.5 నెలల సమయం పడుతోంది. మరోవపు మహీంద్రా ఎక్స్‌యూవీ300కి 2.5 నుంచి 4.5నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
కారు బుక్ చేసినప్పుడు ఉండే ధర.. డెలివరీ సమయంలో ఉంటుందని చెప్పలేము. ఓవైపు వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోతుంటే.. మరోవైపు వాహనాల ధరలను భారీగా పెంచేస్తున్నాయి ఆటో సంస్థలు. ఫలితంగా కారును బుక్ చేసుకున్న కస్టమర్లపై భారం భరీగా పడుతోంది.
Maruti Suzuki price hike : మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హోండాతో పాటు ఇతర ఆటో సంస్థలు.. జనవరిలో వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.
సంబంధిత కథనం