International driving license : ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేయడం ఎలా?
27 February 2023, 19:24 IST
- How to apply for International driving license : మీరు త్వరలోనే విదేశాలకు వెళుతున్నారా? అక్కడ కారు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఇండియాలోనే దానిని అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే..
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేయడం ఎలా?
How to apply for international driving license : ఈ మధ్యకాలంలో చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో చాలా మంది పర్యటిస్తున్నారు. అయితే చాలా మంది లోకల్‌గా ఉండే బస్సులు, రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. కానీ ఇంకొంత మంది సొంత వాహనాల్లో రోడ్ల మీద చక్కర్లు కొట్టాలని భావిస్తారు. ఇండియాలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌ను.. ఆయా ప్రాంతాల్లో చూపిస్తే పని జరగదు. అందుకోసం ప్రత్యేకంగా ఓ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే “ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్”. విదేశీ ప్రయాణానికి ముందే.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇండియాలోనే తీసుకోవచ్చు. ఆ ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాము..
ఇండియాలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్..
భారత దేశ రోడ్డు రవాణాశాఖ.. ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేస్తుంది. ఈ లైసెన్స్‌తో ఇతర దేశాల్లోని 4 వీలర్, 2 వీలర్లను డ్రైవ్ చేయవచ్చు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేస్తున్న వ్యక్తి ఇండియన్ అయ్యి ఉండాలి. అంతేకాకుండా 18ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. సంబంధిత వ్యక్తి సరైన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సరైన పాస్‌పోర్ట్, వీసా కూడా పొంది ఉండాలి.
Apply for international driving license in India : ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లే చేయడం కోసం ఫామ్ 4, ఫామ్ 1ఏతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, పాస్‌పోర్ట్- వీసా కాపీలు, డూప్లికేట్ ఎయిర్ టికెట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, భారత పౌరసత్వాన్ని రుజువు చేసే విధంగా సర్టిఫైడ్ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. రూ. 1000ని అప్లికేషన్ ఫీజ్.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందండం ఎలా..
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వెబ్సైట్ లేదా స్థానిక ఆర్టీఓ దగ్గర ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు.
ఫామ్ 4ఏ, 1ఏని నింపాలి..
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందండంలో తొలి ప్రక్రియ ఫామ్ 4, ఫామ్ 1ఏని నింపడం. ఫామ్ 4ఏ అంటే.. డ్రైవింగ్ చేసేందుకు మీ వద్ద స్కిల్ ఉందని చెప్పే పత్రాలు. ఫామ్ 1ఏ అంటే.. డ్రైవింగ్ చేసేందుకు కావాల్సిన మెడికల్ ఫిట్నెస్. సంబంధిత మంత్రిత్వశాఖ లేదా ఆర్టీఓ అధికారిక వెబ్సైట్లో నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫీజ్‌తో పాటు డాక్యుమెంటల్ను సమర్పించాలి..
International driving license : ఫామ్ 4ఏ, 1ఏని ఫిల్ చేసిన తర్వాత.. మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఐడెంటిటీ, వయస్సు, రెసిడెన్షియల్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు ఇవ్వాలి. లీగల్ డాక్యుమెంట్లలో ఉన్నట్టుగానే ఇవి కూడా ఉండాలి. తప్పులు జరిగితే భవిష్యత్తులో కష్టమవుతుంది. రూ.1000 ఫీజ్‌తో వీటిని సమర్పించాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ టెస్ట్..
చివరిగా.. డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏ విధంగా టెస్ట్ ఉంటుందే.. ఇదీ కూడా అంతే! ఇందులో మీరు సక్సెస్ అయితే.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు మీరు అర్హులవుతారు. 4-5 పని రోజుల్లో మీ లైసెన్స్ మీకు వస్తుంది.