తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda New 100 Cc Bike: హోండా నుంచి చవగ్గా 100 సీసీ బైక్ ‘హోండా షైన్ 100’

Honda new 100 cc bike: హోండా నుంచి చవగ్గా 100 సీసీ బైక్ ‘హోండా షైన్ 100’

Govind Choudhary HT Telugu

14 March 2023, 21:18 IST

    • Honda new 100 cc bike: త్వరలో 100 సీసీ బైక్ ను హోండా కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బైక్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంచి సేల్స్ ను రాబడుతుందని కంపెనీ ఆశిస్తోంది. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Honda new 100 cc bike: హోండా (Honda Motorcycle and Scooter India HMSI)) నుంచి 100 సీసీ బైక్ మార్కెట్లోకి రాబోతుందన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. ఎట్టకేలకు ఆ బైక్ లాంచింగ్ డేట్ ను హోండా ప్రకటించింది. హోండా షైన్ 100 (Honda Shine 100) పేరుతో వస్తున్న ఈ 100 సీసీ బైక్ ను మార్చి 15న మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో లీడర్ గా ఉన్న హీరో మోటోకార్ప్ ను ఈ హోండా షైన్ 100 (Honda Shine 100) బైక్ తో హోండా సవాలు చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

Honda Shine 100 : సెమీ అర్బన్ మార్కెట్

ఇది పట్టణ, గ్రామీణ మార్కెట్లలో మంచి సేల్స్ రాబడుతుందని కంపెనీ ఆశిస్తోంది. ముఖ్యంగా ఈ హోండా షైన్ 100 (Honda Shine 100) ప్రస్తుతం మార్కెట్లో ఉన్నHero Splendor, HF Deluxe, Bajaj Platina, TVS Star City లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Honda Shine 100 : సింపుల్ డిజైన్

ఈ హోండా షైన్ 100 (Honda Shine 100) ను సింపుల్ డిజైన్ తో రూపొందించారు. వైడ్ పుల్ బ్యాక్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ సీట్, అలాయ్ వీల్స్ తో దాదాపు హోండా సీబీ షైన్ 125 (Honda CB Shine 125) తరహాలోనే ఈ హోండా షైన్ 100 (Honda Shine 100) ఉండనుంది. ముందు వైపు టెలీస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్వర్స్ ను, డ్రమ్ బ్రేక్స్ ను ఏర్పాటు చేశారు.

Honda Shine 100 : ధర 73 వేలు..

ఈ హోండా షైన్ 100 (Honda Shine 100) బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 70,000 నుంచి రూ.73000 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. సుమారుగా హీరో స్ప్లెండర్ బైక్ ధర కూడా ఇంతే ఉంటుంది. అయితే, ఈ కేటగిరీలో ఇప్పటికీ అత్యంత చవకైన బైక్ బజాజ్ ప్లాటినా(Bajaj Platina) నే. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 65,856.