Honda 100cc bike : హోండా నుంచి కొత్త 100సీసీ బైక్​.. లాంచ్​ డేట్​ ఇదే-in pics honda to launch new 100cc motorcycle on 15th march check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Honda 100cc Bike : హోండా నుంచి కొత్త 100సీసీ బైక్​.. లాంచ్​ డేట్​ ఇదే

Honda 100cc bike : హోండా నుంచి కొత్త 100సీసీ బైక్​.. లాంచ్​ డేట్​ ఇదే

Feb 27, 2023, 08:51 PM IST Sharath Chitturi
Feb 27, 2023, 08:51 PM , IST

  • Honda 100cc bike launch : హీరో స్ప్లెండర్​కు గట్టిపోటీనిచ్చే విధంగా.. హెచ్​ఎంఎస్​ఐ (హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్స్​ ఇండియా) ఓ కొత్త 100సీసీ బైక్​ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. దీని లాంచ్​ డేట్​ను రివీల్​ చేసింది హోండా సంస్థ. మార్చ్​ 15న ముంబైలో జరగనున్న ఓ ఈవెంట్​లో దీనిని ఆవిష్కరించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్కెట్​లో హోండా షైన్​ మోడల్​కు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మోడల్​కు హోండా షైన్​ 100 అనే పేరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

(1 / 5)

మార్కెట్​లో హోండా షైన్​ మోడల్​కు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మోడల్​కు హోండా షైన్​ 100 అనే పేరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.(HT AUTO)

ఇక డిజైన్​ విషయానికొస్తే.. ఈ కొత్త 100సీసీ మోటార్​సైకిల్​.. హోండా షైన్​ 125 సీసీ బైక్​ని పోలి ఉండొచ్చు. కొన్ని విషయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. హీరో స్ప్లెండర్​ కన్నా మరింత ఆకర్షణీయంగా దీనిని తీర్చిదిద్దవచ్చు.

(2 / 5)

ఇక డిజైన్​ విషయానికొస్తే.. ఈ కొత్త 100సీసీ మోటార్​సైకిల్​.. హోండా షైన్​ 125 సీసీ బైక్​ని పోలి ఉండొచ్చు. కొన్ని విషయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. హీరో స్ప్లెండర్​ కన్నా మరింత ఆకర్షణీయంగా దీనిని తీర్చిదిద్దవచ్చు.(HT AUTO)

ఈ కొత్త హోండా 100 సీసీ బైక్​లో ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటి అట్రాక్టివ్​ ఫీచర్స్​ ఉండొచ్చు.

(3 / 5)

ఈ కొత్త హోండా 100 సీసీ బైక్​లో ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటి అట్రాక్టివ్​ ఫీచర్స్​ ఉండొచ్చు.(HT AUTO)

ఈ కొత్త మోడల్​కు సంబంధించిన ధర, ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలు మార్చ్​ 15న జరగనున్న ఈవెంట్​లో వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

(4 / 5)

ఈ కొత్త మోడల్​కు సంబంధించిన ధర, ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలు మార్చ్​ 15న జరగనున్న ఈవెంట్​లో వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.(HT AUTO)

కొత్త 100సీసీ బైక్​ మీద హోండా సంస్థ చాలా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ బైక్​తో తన మార్కెట్​ షేరును పెంచుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అందుకే దీనిని చాలా శ్రద్ధగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

(5 / 5)

కొత్త 100సీసీ బైక్​ మీద హోండా సంస్థ చాలా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ బైక్​తో తన మార్కెట్​ షేరును పెంచుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అందుకే దీనిని చాలా శ్రద్ధగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.(HT AUTO)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు